Vastu Tips: నటరాజస్వామి విగ్రహాన్ని ఇంట్లో ఉంచవచ్చా..? ఏయే దేవతా మూర్తుల పూజ నిషిద్ధం..? తెలుసుకుందాం రండి..
సనాతన హిందూ ధర్మంలో పూజలు, పారాయణం, ఉపవాసం, పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ప్రజలు దేవతలను, వారి వివిధ రూపాలలో ఉన్న విగ్రహాలను తమ పూజగదులలో ప్రతిష్టిస్తారు. కానీ కొన్ని రకాల విగ్రహాలను ఇంట్లో పూజించడం..
సనాతన హిందూ ధర్మంలో పూజలు, పారాయణం, ఉపవాసం, పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ప్రజలు దేవతలను, వారి వివిధ రూపాలలో ఉన్న విగ్రహాలను తమ పూజగదులలో ప్రతిష్టిస్తారు. కానీ కొన్ని రకాల విగ్రహాలను ఇంట్లో పూజించడం లేదా ప్రతిష్టించడం నిషిద్ధమని మీకు తెలుసా..? ఈ నిషిద్ధ విగ్రహాలను ఇంటిలో లేదా పూజ గదులలో ఉంచడం వల్ల అనేక సమస్యలు, అశుభాలను ఎదుర్కొనవలసి ఉంటుందని పెద్దల మాట. అంతేకాక ఈ దేవతా మూర్తులను తప్పుగా పూజించినా కూడా ఇంట్లో గందరగోళమైన వాతావరణం కలుగుతుంది. అదే క్రమంలో విరిగిన విగ్రహాలను కూడా పూజించకూడదు, ప్రతిష్టించకూడదు.
అయితే పెద్దల మాట పెడచెవిన పెట్టి ఇలా పూజించడం లేదా ప్రతిష్టించడం వల్ల జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను అనుభవించక తప్పదని నమ్ముతారు. అలాగే శుభ ఫలితాలు కూడా కలగవని విశ్వాసం. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తపడాలంటే ఆయా విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. ఒక వేళ ఇప్పటికే మీ ఇంట్లో అలాంటి విగ్రహాలు ఉన్నట్లయితే వెనువెంటనే వాటిని నదీప్రవాహంలో నిమజ్జనం చేయాలంటున్నాయి శాస్త్రాలు. మరి ఆ విగ్రహాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నటరాజ స్వామి: భీకర రూపంలో తాండవం చేస్తున్న శివుడే నటరాజస్వామి. సర్వశాస్త్రాలకు రూపకర్త అయిన శివుడు నాట్యానికి కూడా అదికర్త. నటరాజస్వామిగా శివుడు బీకర రూపంలో ఉన్నందున.. ఆ విగ్రహం ఇంట్లో ఉండడం మంచిది కాదని, నిషేధించారు.
శని దేవుడు: ఇంట్లో శని దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం కూడా నిషేధం. సూర్యపుత్రుడైన శని దేవుడిని ఎల్లప్పుడూ ఇంటి వెలుపల పూజిస్తారు. అలా చేయడమే మంచిదని పెద్దలు నమ్మేవారు. కాబట్టి శని దేవుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించవద్దు.
భైరవ్ బాబా: భైరవ్ బాబాను కూడా శివుని స్వరూపంగా భావిస్తారు. కానీ భైరవ్ బాబా సంబంధం తంత్ర-మంత్ర విద్యలతో ముడిపడి ఉంది. అందువల్ల భైరవ బాబాను ఇంట్లో ప్రతిష్టించకూడదు.
రాహు-కేతు- జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతులను చెడు గ్రహాలలో లెక్కిస్తారు. మీ ఇంట్లో లేదా జాతకంలో రాహు-కేతు దోషం ఉంటే చెడు జరగడం ప్రారంభమవుతుంది లేదా చెడు ఫలితాలను పొందుతారు. అందుకే పొరపాటున కూడా రాహు-కేతువుల విగ్రహాలను ఇంట్లో ప్రతిష్టించకండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..