Astro Tips: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ 6 అలవాట్ల వల్ల మనిషిని దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది.. ఏవి ఏమిటో తెలుసా

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..  చెడు అలవాట్ల కారణంగా ఆ  వ్యక్తి జీవితంలో దురదృష్టం అతని  నీడగా వెంటాడుతుంది. పనిలో నిరంతర వైఫల్యాలను ఎదుర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ అలవాట్లు మనిషి జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుందాం.

Astro Tips: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ 6 అలవాట్ల వల్ల మనిషిని దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది.. ఏవి ఏమిటో తెలుసా
Vastu Tips For Wealth
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2023 | 6:34 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  గ్రహాలు, రాశులు ఒక వ్యక్తి జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. జాతకంలో గ్రహాలు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలను అందుకుంటాడు. అయితే జాతకంలో ఉన్న గ్రహాలు శుభ దృష్టిలో లేకుంటే.. అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. వ్యక్తి జీవితం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల శుభ, అశుభ ప్రభావం ఆ వ్యక్తి  అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో మంచి అలవాట్లు ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. చెడు అలవాట్లు ఉన్నవారు తమ ఇంట్లో వివిధ రకాల వాస్తు దోషాలను కలిగి ఉంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..  చెడు అలవాట్ల కారణంగా ఆ  వ్యక్తి జీవితంలో దురదృష్టం అతని  నీడగా వెంటాడుతుంది. పనిలో నిరంతర వైఫల్యాలను ఎదుర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ అలవాట్లు మనిషి జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుందాం.

పాదరక్షలను విడిచే అలవాట్లు ఇంట్లో చెప్పులు.. సరిగా పెట్టుకోని వారి ఇళ్లలో ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఎక్కడబడితే అక్కడ బూట్లు, చెప్పులు పడి ఉన్న ఇళ్లలో ఆర్థిక సమస్యలు, ధన నష్టం, మనస్పర్థలు ఎప్పుడూ ఉంటాయి. పాదరక్షలు, చెప్పులు సరైన స్థలంలో, సరైన ప్రదేశంలో ఉంచని ఇళ్లలో శనిదోషం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరగాలంటే బూట్లు, చెప్పులు ఎప్పుడూ విప్పకూడదు.

ఉమ్మివేసే అలవాటు వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తరచుగా ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేస్తూ ఉంటారు. ఇటువంటి వారి జీవితంలో ఎప్పుడూ దురదృష్టం నీడ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ అలవాటు వల్ల బుధ, సూర్యుని చెడు ప్రభావాలు మనిషి జీవితంలో పడటం ప్రారంభిస్తాయి. ఎక్కడైనా పదే పదే ఉమ్మివేసే వారి కీర్తి, గౌరవం, ప్రతిష్టలు ఆ వ్యక్తి జీవితంలో దెబ్బతింటాయి.

ఇవి కూడా చదవండి

తిన్న పాత్రలను ఎక్కువ సేపు వదిలివేయడం  రాత్రిపూట ఆహారం తయారుచేసేన తర్వాత.. తిన్న తర్వాత చాలా మంది ఆ గిన్నెలను సింక్‌లో వదిలివేస్తారు. ఈ అలవాటు వల్ల వెంటనే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. అంతే కాకుండా ఆహారం తిన్న తర్వాత ప్లేట్‌లో చేతులు కడిగి ఆ ప్లేట్‌ని అక్కడే వదిలేసి లేవడం చాలా మందికి అలవాటు. వాస్తులోని ఈ అలవాటు వల్ల ఇంట్లో అనర్థాలు పెరుగుతాయి. అలాంటి వారు అనేక వ్యాధులను, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో తిన్న గిన్నెలను కడకుండా నిల్వ పెట్టుకునే అలవాటు ఉన్నవారి జీవితంలో శని, చంద్ర దోషం ఏర్పడుతుంది.

ఇంట్లో వస్తువులను ఎక్కడ బడితే అక్కడ వదిలేయడం..  చాలా మందికి తమ ఇళ్లలో వస్తువులను ఎక్కడబడితే అక్కడ వదిలేయడం అలవాటు. ఈ అలవాటు వల్ల మనిషి జీవన ప్రగతికి ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాదు ఇటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే మంచం మీద దుప్పట్లను అలాగే వదిలేస్తారు. ప్రతికూల శక్తి దాని ఇంట్లో ఉంటుంది. ఆర్థిక శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల ఆ  వ్యక్తి జాతకంలో రాహు, శనీశ్వరుడు చెడు ఫలితాలను ఇస్తారు.

ఇంట్లో ఎండిన మొక్కలను ఉంచడం చాలా మంది తరచుగా మొక్కలను నాటుతారు.. అయితే ఆ మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టరు. దీని కారణంగా మొక్క ఎండిపోతాయి. వాస్తు ప్రకారం ఇలా మొక్కలు ఎడిపోవడం ప్రతికూల శక్తి త్వరగా వ్యాపిస్తుంది. ఆ వ్యక్తిని దురదృష్టం  వెంటాడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే