పురాణాల కథనం ప్రకారం కొన్ని వందల ఏళ్ల క్రితం మొట్టమొదటి గా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడం తో ఈ తోటకు విశేష ప్రాధాన్యత లభించింది. ప్రభల తీర్ధం ఏకాదశ రుద్రుల కొలువు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా, ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే అదీ వేదసీమ అయినటు వంటి కోనసీమలోనే.