AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Break Fast: టీ, కాఫీల బదులు వీటితో రోజును ప్రారంభించండి.. అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

టీ, కాఫీలు కాకుండా అరటిపండు లేదా నానబెట్టిన బాదం లేదా నానబెట్టిన ఎండుద్రాక్షతో మీ రోజును ప్రారంభించాలనుకుంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ చేశారామె.

Break Fast: టీ, కాఫీల బదులు వీటితో రోజును ప్రారంభించండి.. అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
Break Fast Tips
Basha Shek
|

Updated on: Jan 13, 2023 | 8:10 PM

Share

చాలా మంది ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతారు. అయితే వీటికి బదులు అరటిపండ్లు , నానబెట్టిన బాదం లేదా నానబెట్టిన ఎండుద్రాక్ష తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం ఉదయాన్నే తీసుకునే ఆహారమే మన రోజును ప్రభావితం చేస్తుంది. ఎంత మంచి ఆహారం తీసుకుంటే ఆరోజు అంత యాక్టివ్‌గా ఉంటారు. కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిపోతాయట. అయితే టీ, కాఫీలు కాకుండా అరటిపండు లేదా నానబెట్టిన బాదం లేదా నానబెట్టిన ఎండుద్రాక్షతో మీ రోజును ప్రారంభించాలనుకుంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ చేశారామె. ఇందులో అజీర్తి, ఎసిడిటీ తదితర ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు అరటిపండుతో రోజు ప్రారంభించాలంటున్నారామె. ఒకవేళ అరటి పండ్లను తినడం ఇష్టం లేకపోతే సీజనల్‌గా వచ్చే ఏవైనా పండ్లను పరగడుపునే తీసుకోవాలని రుజుతా సూచిస్తున్నారు.

జీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినాలని కోరికలు ఉన్నవారు ఉదయాన్నే అరటిపండు తినాలి. ఇక ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, పీసీఓడీ, తక్కువ సంతానోత్పత్తి, నిద్రలేమి సమస్యలు ఉంటే రోజూ ఉదయాన్నే 4-5 నానబెట్టిన బాదంపప్పులను తినడం మంచిది. ఇక పీఎంఎస్‌ సమస్యలతో బాధపడేవారు రోజూ 6-7 నానబెట్టిన ద్రాక్షను తినాలి. వీటితో పాటు

ఇవి కూడా చదవండి
  • అల్పాహారం తీసుకున్న 10-15 నిమిషాల తర్వాత టీ లేదా కాఫీ తాగడం మంచిది.
  • ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు త్రాగి, ఆపై అల్పాహారం తీసుకోండి.
  • అల్పాహారం 10-15 నిమిషాల తర్వాత వ్యాయామం, యోగా మొదలైనవి చేయవచ్చు
  • ఎండుద్రాక్ష నానబెట్టిన  నీటిని తాగితే కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..