Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veera Simha Reddy: జై బాలయ్య పాటకు పూజారి అదిరిపోయే డ్యాన్స్.. పూనకం వచ్చినట్లుగా మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్‌

టైటిల్‌ సాంగ్‌ జై బాలయ్య పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి పేపర్లు విసురుతూ స్టెప్పులేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Veera Simha Reddy: జై బాలయ్య పాటకు పూజారి అదిరిపోయే డ్యాన్స్.. పూనకం వచ్చినట్లుగా మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్‌
Priest Dance
Follow us
Basha Shek

|

Updated on: Jan 12, 2023 | 5:53 PM

బాలకృష్ణ నటించిన వీరసంహారెడ్డి మేనియాతో రెండు రాష్ట్రాల్లోని థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఎక్కడ చూసినా జై బాలయ్య నినాదాలు మార్మోగుతున్నాయి. నందమూరి హీరో కటౌట్లకు భారీ పూలదండలు, పాలాభిషేకాలు చేస్తూ హంగామా చేస్తున్నారు. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉదయం నుంచి థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల హంగామా మొదలైంది. సిల్వర్‌ స్ర్కీన్‌పై బాలయ్య గర్జనను మరోసారి చూసేందుకు తహతహలాడుతున్నారు. ఇక థియేటర్లలో అయితే పేపర్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పాటలు వచ్చిన సమయంలో ఈలలు, కేకలు వస్తూ థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌ జై బాలయ్య పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి పేపర్లు విసురుతూ స్టెప్పులేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తిరుపతి లో ఒక పూజారి వీరసింహారెడ్డి సినిమా మొదటి షో చూడడానికి వచ్చాడు. అంతేకాకుండా జై బాలయ్య వచ్చినప్పుడు పూనకంతో ఊగిపోయినట్లుగా మాస్ స్టెప్పులు కూడా వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పూజారి వయసు సుమారు 70 వరకు ఉండొచ్చు. కానీ ఆ వయసులో కూడా బాలయ్య సాంగ్స్ కు ఊగిపోతూ డ్యాన్స్‌ చేశాడు. తిరుపతి ప్రతాప్ థియాటర్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఇక పూజారి స్టెప్స్ కు ముగ్ధులైన బాలయ్య అభిమానులు ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్‌, హానీరోజ్‌ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, దునియా విజయ్‌ ప్రతినాయక పాత్రల్లో కనిపించారు. తమన్‌ అందించిన స్వరాలతో థియేటర్ల బాక్సులు దద్దరిల్లిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..