Hyper Aadi: జబర్ధస్త్ మానేయడానికి కారణం ఆమెనే.. షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..
శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ముఖ్యంగా అందులో హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను జబర్ధస్త్ మానేయడానికి కారణం యాంకర్ సౌమ్య అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
హైపర్ ఆది.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆది.. తనదైన పంచులతో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆది పంచులకు.. కామెడీకి అభిమానులు చాలా మంది ఉన్నారు. కేవలం జబర్ధస్త్ మాత్రమే కాకుండా… మరో కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ తన మార్క్ చూపిస్తున్నారు ఆది. కొత్త కొత్త కాన్సెప్ట్స్.. తోటి కంటెస్టెంట్స్ పై ఆయన తను వేసే పంచులు హైలెట్ అవుతుంటాయి. కేవలం నార్మల్స్ స్కిట్స్ కాకుండా. ప్రతి పండగకు.. ఇతర ప్రత్యేక సందర్భాల్లో సరికొత్తగా స్కిట్స్ చేస్తుంటారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ముఖ్యంగా అందులో హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను జబర్ధస్త్ మానేయడానికి కారణం యాంకర్ సౌమ్య అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. పెద్ద రాయుడి గెటప్ లో అలరించాడు హైపర్ ఆది. ఎప్పటిలాగే బుల్లెట్ భాస్కర్.. నరేష్ తమ కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించారు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మి.. హైపర్ ఆదిని కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో మీరు జబర్ధస్త్ మానేయడానికి ఈ ముగ్గురిలో ఎవరు కారణం అని అడుగుతూ ముగ్గురి ఫోటోస్ స్క్రీన్ పై చూపించింది. అందులో యాంకర్ సౌమ్యతోపాటు.. మరో ఇద్దరి ఫోటోస్ ఉన్నాయి. తాను జబర్ధస్త్ మానేయడానికి కారణం యాంకర్ సౌమ్య అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఆది. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరలవుతుంది.
అయితే ఆది జబర్దస్త్ మానేయడానికి కారణం యాంకర్ సౌమ్యరావు ఎందుకు కారణమనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అటు బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపై కూడా అలరిస్తున్నారు ఆది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.