- Telugu News Photo Gallery Cricket photos Umran Malik Highest Bowling Speed 156 KMPH in India vs Sri Lanka 1st ODI
లంకేయులపై నిప్పులు చెరిగిన టీమిండియా స్పీడ్ గన్.. అత్యంత ఫాస్టెస్ట్ బాల్ విసిరి రికార్డు సృష్టించిన ఉమ్రాన్ మాలిక్
వన్డేల్లో అత్యంత వేగవంతమైన భారత బౌలర్‌గా ఉమ్రాన్ రికార్డు సృష్టించాడు. మంగళవారం (జనవరి 10) గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు.
Updated on: Jan 10, 2023 | 9:18 PM

ఇటీవలి కాలంలో టీమిండియాలో ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ తదితర బౌలర్లు అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడీ జాబితాలో మరో స్పీడ్‌గన్ చేరాడు. అతనే జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్.

వన్డేల్లో అత్యంత వేగవంతమైన భారత బౌలర్‌గా ఉమ్రాన్ రికార్డు సృష్టించాడు. మంగళవారం (జనవరి 10) గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు.

కాగా టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బౌలర్ కూడా ఉమ్రాన్. 2023 జనవరి 3న శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 155 కి.మీ వేగంతో బంతి విసిరి శ్రీలంక కెప్టెన్ దసున్ షనక వికెట్ తీశాడీ స్పీడ్ స్టర్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా ఉమ్రాన్ ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఉమ్రాన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. అతను IPL-2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 157 kmph వేగంతో బంతిని వేశాడు

ఇక తాజాగా లంకతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి మరోసారి సత్తా చాటాడు ఉమ్రాన్ మాలిక్. నిస్సాంక, అసలంక, వెల్లెగెలే వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.




