- Telugu News Photo Gallery Cricket photos Team India Captain Rohit Sharma Creates new Record as an Opener
ODI Opener: సచిన్, గంగూలీని అధిగమించిన హిట్‌మ్యాన్.. కేవలం 149 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించిన ఓపెనర్‌గా రోహిత్..
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ శుభారంభం అందించారు..
Updated on: Jan 11, 2023 | 10:10 AM

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ శుభారంభం అందించారు.

ఆ మ్యాచ్‌లో 67 బంతుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ 3 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. దీంతో వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ 7500 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాక వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 7500 పరుగులు చేసిన ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు.

గతంలో ఈ ప్రపంచ క్రికెట్ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ అమ్లా పేరిట ఉంది. ఆమ్లా 158 వన్డే క్రికెట్ ఇన్నింగ్స్‌లో 7500 పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.

హాషిమ్ అమ్లాకు ముందు సచిన్ టెండూల్కర్ వన్డే ఓపెనర్‌గా 170 ఇన్నింగ్స్‌లో ఏడు వేల ఐదు వందల పరుగులు సాధించాడు. అంతేకాక టీమ్ ఇండియా తరఫున అత్యంత వేగంగా 7500 పరుగులు చేసిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కూడా సచిన్ నిలిచాడు.

అలాగే సచిన్ కంటే ముందు సౌరవ్ గంగూలీ 182 వన్డే ఇన్నింగ్స్‌లో వన్డే ఓపెనర్‌గా 7500 పరుగులు చేశాడు. ఇప్పుడు వీరందరినీ అధిగమించి రోహిత్ శర్మ కేవలం 149 ఇన్నింగ్స్‌ల్లోనే 7500 పరుగులు చేశాడు.

దీంతో వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 7500 పరుగులు చేసిన ఓపెనర్‌గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు.





























