- Telugu News Photo Gallery Cinema photos Actress Nabha Natesh Met with Bad Accident And Her left hand Fractured
Nabha Natesh: నేను సినిమాల్లో నటించకపోవడానికి కారణమదే.. షాకింగ్ విషయం చెప్పిన నభా నటేష్
2015లో విడుదలైన కన్నడ చిత్రం 'వజ్రకాయ' ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Jan 10, 2023 | 9:35 PM

2015లో విడుదలైన కన్నడ చిత్రం 'వజ్రకాయ' ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే 2021 తర్వాత ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు. కొత్త సినిమాలను అంగీకరించలేదు. దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు.

దీనికి ఇప్పుడు సమాధానం దొరికింది. 2022లో నభా నటేష్‌కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఎడమ చేతికి, ఎడమ భుజానికి గాయాలయ్యాయి. ఈ కారణంగా చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది.

తనకు యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది నభా. ఇప్పుడు కోలుకుంటున్నట్లు, 2023లో సినిమాలు చేయనున్నట్లు తెలిపింది.

కాగా నభా నటేష్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.





























