Shah Rukh Khan: ఆస్కార్‌ అవార్డును తాకనివ్వరా? రామ్‌చరణ్‌కు షారుఖ్‌ రిక్వెస్ట్‌.. చెర్రీ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఇవాళ (జనవరి 10)న ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్ విడుదల చేశాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌ లో ఉండి కూడా ట్రైలర్ రిలీజ్‌కి సమయం కేటాయించడంతో షారుఖ్ తన ట్విట్టర్ ద్వారా చెర్రీకి కృతజ్ఞతలు తెలియజేశాడు.

Shah Rukh Khan: ఆస్కార్‌ అవార్డును తాకనివ్వరా? రామ్‌చరణ్‌కు షారుఖ్‌ రిక్వెస్ట్‌.. చెర్రీ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా?
Sharukh Khan, Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2023 | 9:13 PM

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, తారక్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్‌ ప్రముఖుల ప్రశంసలతో పాటు లెక్కలేనన్ని పురస్కారాలు సొంతం చేసుకుంది. ఇప్పుడీ విజువల్‌ గ్రాండియర్‌ ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు బరిలో నిలిచింది. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని లాస్ ఏంజెల్స్ లోని థియేటర్ లో ప్రదర్శిస్తున్నారు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రేస్ లో కూడా ఈ సినిమా నిలవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హోమ్ అఫ్ హాలీవుడ్ కి చేరుకున్నారు. అక్కడి ప్రముఖులతో చిట్ చాట్ నిర్వహిస్తూ ఆర్ఆర్ఆర్‌ను మరింతగా ప్రమోట్‌ చేస్తున్నారు. కాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఇవాళ (జనవరి 10)న ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్ విడుదల చేశాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌ లో ఉండి కూడా ట్రైలర్ రిలీజ్‌కి సమయం కేటాయించడంతో షారుఖ్ తన ట్విట్టర్ ద్వారా చెర్రీకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు. మీ ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొస్తే.. ఆ పురస్కారాన్ని తాకేందుకు నాకు అవకాశమివ్వండి’ అని ట్వీట్‌ చేశాడు.

దీనికి రామ్‌చరణ్‌ కూడా స్పందించాడు. ‘తప్పకుండా షారుఖ్‌ సర్.. ఒకవేళ మేం ఆస్కార్ గెలిస్తే అది భారతీయ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చెందుతుంది’ అంటూ రిప్లై ఇచ్చి తన వినమ్రతను చాటుకున్నాడు. ఇలా షారుఖ్‌- చెర్రీల సంభాషణలకు సంబంధించిన ట్వీట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆస్కార్‌ పురస్కారం వస్తే అది భారతీయ సినిమా ఇండస్ట్రీ అంతటికి చెందుతుందంటూ చెర్రీ ఇచ్చిన రిప్లై అందరి మనసులను తాకింది. కాగా షారుక్ ఖాన్‌, బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొణె జంటగా నటించిన పఠాన్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో జాన్‌ అబ్రహం విలన్‌గా నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో