AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dwaine Pretorius: స్టార్‌ ఆల్‌రౌండర్‌ సంచలన నిర్ణయం.. కుటుంబం కోసం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

దక్షిణాఫ్రికా స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి అటు తన ఫ్యాన్స్‌కు, సౌతాఫ్రికా జట్టుకు షాక్‌ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్‌ కోసం సన్నద్ధమవుతోన్న తరుణంలో ప్రిటోరియస్‌ నిర్ణయం సఫారీ జట్టుకు షాకింగ్‌కు గురిచేసింది.

Dwaine Pretorius: స్టార్‌ ఆల్‌రౌండర్‌ సంచలన నిర్ణయం.. కుటుంబం కోసం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
Dwaine Pretorius
Basha Shek
|

Updated on: Jan 09, 2023 | 6:14 PM

Share

దక్షిణాఫ్రికా స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి అటు తన ఫ్యాన్స్‌కు, సౌతాఫ్రికా జట్టుకు షాక్‌ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్‌ కోసం సన్నద్ధమవుతోన్న తరుణంలో ప్రిటోరియస్‌ నిర్ణయం సఫారీ జట్టుకు షాకింగ్‌కు గురిచేసింది. దక్షిణాఫ్రికా తరఫున 30 టీ20లు, 27 వన్డేలు, 3 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 33 ఏళ్ల ప్రిటోరియస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇండోర్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ను 8 పరుగుల వద్ద అవుట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు ప్రిటోరియస్‌. ఇక దక్షిణాఫ్రికా తరఫున 2 ప్రపంచకప్‌లు ఆడాడు కాగా T20 లతో పాటు ఇతర పొట్టి ఫార్మాట్లపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తన రిటైర్మెంట్ ప్రకటనలో తెలిపాడీ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌. దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్‌గా కూడా అతని పేరు మీదే ఉంది. పాకిస్థాన్‌పై ప్రిటోరియస్ 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడీ స్టార్ ఆల్‌రౌండర్‌. ఇక గత సంవత్సరం T20 ప్రపంచ కప్‌కు కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే గాయం కారణంగా టోర్నమెంట్ ముందే తప్పుకున్నాడు.

సౌతాఫ్రికా తరఫున ప్రిటోరియస్ 3 టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. అలాగే 27 వన్డేల్లో 35 వికెట్లు తీశాడు. 30 టీ20 మ్యాచ్‌లు ఆడి 35 వికెట్లు కూడా తీశాడు. ప్రిటోరియస్ ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా రాబోయే రోజుల్లో డ్వేన్‌ చాలా బిజగా ఉండనున్నాడు. SA20 లీగ్ ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఐపీఎల్‌లో బిజీ కానున్నాడు. కాగా T20 లతో పాటు ఇతర పొట్టి ఫార్మాట్లపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తన రిటైర్మెంట్ ప్రకటనలో తెలిపాడీ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌. మున్ముందు టీ20, ఇతర పొట్టి ఫార్మాట్లపై దృష్టి సారిస్తాను. ఈ నిర్ణయయంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే నాకు నచ్చినట్లుగా నేను ఆడగలిగే స్వేచ్ఛ లభించింది. అలాగే నా కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయించగలుగుతాను. నా ప్రయాణంలో ఇంతవరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తన వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు ప్రిటోరియస్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..