Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Parvathi: అలాగైతే తారక్‌ తప్పకుండా టీడీపీలోకి వస్తాడు.. తిరుమలలో లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ ఛైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె ఏపీ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో లోకేశ్‌ నాయకత్వాన్ని అంగీకరించేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏ మాత్రం సిద్ధంగా లేరన్నారు

Lakshmi Parvathi: అలాగైతే తారక్‌ తప్పకుండా టీడీపీలోకి వస్తాడు.. తిరుమలలో లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు
Jr Ntr, Lakshmi Parvathi
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2023 | 1:26 PM

ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ ఛైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె ఏపీ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో లోకేశ్‌ నాయకత్వాన్ని అంగీకరించేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏ మాత్రం సిద్ధంగా లేరన్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తేనే తారక్‌ టీడీపీలోకి వెళ్లే అవకాశముందున్నారు. ఇప్పుడు ఇంతకుమించి తానేం మాట్లాడలేనని, టీడీపీలోకి తారక్ అడుగుపెట్టాక తాను స్పందిస్తానని అన్నారు. అయితే ప్రస్తుతానికి సీఎం జగన్ పాలన చాలా బాగుందని, శ్రీవారి ఆలయ నిర్వహణ కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఎంతమంది కలిసొచ్చినాసరే.. సీఎం జగన్‌ని ఎదురించలేరని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం వీఐపీ విరామ సమయంలో లక్ష్మీపార్వతి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులతో కొందరు టీడీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తారక్‌కు బాధ్యతలు ఇస్తే.. టీడీపీకి అతని క్రేజ్ కలిసొస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించిన కొన్ని చోట్ల జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు కూడా దర్శనమిచ్చాయి. అయితే జూనియర్‌ మాత్రం రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రహీరోగా వెలుగొందుతోన్న అతను మరికొంత కాలం తన సినిమాల మీదే పూర్తి దృష్టి సారించనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
ఇన్ని రికార్డులా..! సునీతమ్మా.. నీకు వందనం!
ఇన్ని రికార్డులా..! సునీతమ్మా.. నీకు వందనం!
IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే
IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే