AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయి’.. వాల్తేరు వీరయ్యగా మారిపోయిన విరాట్‌ కోహ్లీ.. ఫొటో వైరల్

ప్రముఖ స్పోర్ట్స్‌ ఛానెల్‌ ‘స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు’ మన రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీకి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి నోటి వెంట వచ్చిన ఓ డైలాగ్‌ను రికార్డుల రారాజుకు అన్వియించింది.

Virat Kohli: 'నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయి'.. వాల్తేరు వీరయ్యగా మారిపోయిన విరాట్‌ కోహ్లీ.. ఫొటో వైరల్
Chiranjeevi, Virat Kohli
Basha Shek
|

Updated on: Jan 09, 2023 | 5:09 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మాస్‌ మహరాజా రవితేజ కీలక పాత్రలో కనిపించనుండగా.. శ్రుతిహాసన్‌ చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటించనుంది. ఈనెల13న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుందీ మెగా మూవీ. మరోవైపు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. మంగళవారం (జనవరి 10) మొదటి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌ కోసం రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు మళ్లీ జట్టులో చేరారు. ఈనేపథ్యంలోప్రముఖ స్పోర్ట్స్‌ ఛానెల్‌ ‘స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు’ మన రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీకి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి నోటి వెంట వచ్చిన ఓ డైలాగ్‌ను రికార్డుల రారాజుకు అన్వియించింది. ‘రికార్డుల్లో నా పేరు ఉండడం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయి.. కింగ్‌ కోహ్లీ బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌’ అంటూ ఆ సినిమాలో చిరంజీవి పోస్టర్‌లో కోహ్లీని చేర్చింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అటు కోహ్లీ ఫ్యాన్స్‌, ఇటు మెగా ఫ్యాన్స్‌ ఈ ఫొటోను చూసి తెగ సంబరపడిపోతున్నారు.

కాగా లంకతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్‌ ఆడలేదు. బంగ్లాదేశ్‌ పర్యటన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న కోహ్లి తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లాడు. అక్కడే కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌గా జరుపుకొన్నాడు. తన భార్య అనుష్కా, కూతురు వామికతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్‌ చేశాడు. ఇప్పుడీ వన్డే సిరీస్‌ ద్వారా మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. మొత్తం 3 మ్యాచ్‌లు జరగనున్నాయి. మంగళవారం గువహటి వేదికగా మొదటి మ్యాచ్‌ జరగనుంది. కాగా మరో 10 నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి సన్నాహకంగా భాగంగా ఈ సిరీస్‌ను భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..