Shanmukh- Deepthi Sunaina: దీప్తి సునైనాకు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన చెప్పిన ఎక్స్‌ లవర్‌ ష‌ణ్ముఖ్.. మరి రిప్లై ఇస్తుందా?

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో కంటెస్టెంటుగా అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్ సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరు అందరినీ విస్మయపరిచింది. ఈ విషయంలో అతని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. దీంతో దీప్తి కూడా సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ అతనికి బ్రేకప్ చెప్పేసింది.

Shanmukh- Deepthi Sunaina: దీప్తి సునైనాకు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన చెప్పిన ఎక్స్‌ లవర్‌ ష‌ణ్ముఖ్.. మరి రిప్లై ఇస్తుందా?
Shanmukh, Deepthi
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2023 | 7:58 PM

యూట్యూబ్‌ స్టార్స్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, దీప్తి సునైనాల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌లో అయినా ఎంతో కలివిడిగా ఉండే ఈ జోడి మొదట డ్యాన్స్‌ వీడియోలతో తెగ పాపులర్‌ అయ్యారు. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే అనూహ్యంగా అక్కడే వీరి బంధానికి బ్రేకులు పడ్డాయి. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో కంటెస్టెంటుగా అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్ సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరు అందరినీ విస్మయపరిచింది. ఈ విషయంలో అతని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. దీంతో దీప్తి కూడా సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఇక తమదారులు వేరని, కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆతర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. ఆ మధ్యన జస్వంత్‌, దీప్తి ఇద్దరు వేర్వేరుగా కొత్త ఇళ్లల్లోకి అడుగుపెట్టారు. అయితే గృహప్రవేశ వేడుకల కోసం ఒకరిని ఒకరు ఆహ్వానించుకోలేదు. దీంతో బ్రేకప్‌పై ఇద్దరూ సీరియస్‌గానే ఉన్నారని అర్ధమైంది. అయితే ఇవాళ (జనవరి 10 )దీప్తి సునయన బర్త్‌డే. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే డీ(దీప్తి సునయన)’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు షణ్ముఖ్. ఇదిప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనికి దీప్తి తిరిగి రిప్లై ఇచ్చిందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

కాగా ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో షణ్ముఖ్‌ జస్వంత్‌, దీప్తి సందడి చేశారు. ఈ సందర్భంగా దీప్తిని చూస్తూ షణ్నూ సిగ్గుపడిపోయిన క్లిప్పింగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా స్టేజ్‌పైన దీప్తి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షణ్ముఖ్‌ ‘నేను దీప్తీని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు కూడా దీప్తీని చూసి చాలా నేర్చుకోవాలి. మీరు కూడా ఒక ఇన్‌స్పిరేషన్ కావాలి’ అని చెప్పుకొచ్చాడు. తాజాగా దీప్తి పుట్టిన రోజును పోస్ట్ పెట్టడంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా? త్వరలోనే ఆ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకుంటారా అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Deepthi Sunaina, Shanmukh

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..