Kiran Abbavaram: నన్ను సినిమా ఇండస్ట్రీ నుంచి పంపించేందుకు ప్రయత్నాలు.. యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు
రాజావారు రాణిగారుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఎస్.ఆర్. కల్యాణమండపంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు మరింత చేరువయ్యాడు.
సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాణిస్తోన్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. రాజావారు రాణిగారుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఎస్.ఆర్. కల్యాణమండపంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు మరింత చేరువయ్యాడు. కేవలం నటనతోనే కాకుండా రైటర్‌గానూ మెప్పిస్తున్నాడీ యంగ్ హీరో. త్వరలోనే వినరో భాగ్యము విష్ణుకథ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న కిరణ్ తనపై నెట్టింట్లో వస్తోన్న నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్‌పై స్పందించాడు. ‘నేను ఇంకా స్టార్ హీరోని కాలేదు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అయితే కొందరు నాపై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. వారెందుకు అలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నేను స్పందించకపోవడం వల్లే ఇలా జరుగుతుందేమో. ఇదంతా కావాలనే చేస్తున్నారేమో. నన్ను సినిమా ఇండస్ట్రీ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారేమో’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కిరణ్.
కాగా కిరణ్ అబ్బవరం గత చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా సమయంలో అతని ఇంట్రడక్షన్ సీన్‌లో కిరణ్ అబ్బవరం అనే టైటిల్ కార్డుపై పవర్ స్టార్ అని ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతనిని దారుణంగా ట్రోల్ చేశారు. ఈ విషయంపైనా స్పందించిన కిరణ్ ‘ఒక సినిమాలో నేను వేసుకోకపోయినా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేశారు. అది నేను పెట్టుకున్నానంటూ కొందరు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. మరి ఇంత దారుణంగా చేయాలా? దీనిని చాలా మంది నమ్మేశారు. ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు’ అని చెప్పుకొచ్చాడు కిరణ్. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..