AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘ఆరుగురు పతివ్రతలు’ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.? ఎలా ఉందంటే?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ హిట్ అండ్ ఫ్లాప్‌‌ల మధ్య ఊగిసులాడుతుంది. ఏ హీరోయిన్ ఎప్పుడు అవకాశాలు అందుకుని..

Tollywood: 'ఆరుగురు పతివ్రతలు' హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.? ఎలా ఉందంటే?
Tollywood
Ravi Kiran
|

Updated on: Jan 10, 2023 | 6:19 PM

Share

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ హిట్ అండ్ ఫ్లాప్‌‌ల మధ్య ఊగిసులాడుతుంది. ఏ హీరోయిన్ ఎప్పుడు అవకాశాలు అందుకుని అగ్రస్థానం చేరుకుంటుందో.. ఏ హీరోయిన్ అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొంతమంది అయితే ఒక్క సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుని ఫేడ్ అవుట్ అయిపోయారు. సరిగ్గా ఇదే కోవలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఇండస్ట్రీకి దూరమైన నటి అమృత.

మీకు ఆమెవరో గుర్తుండకపోవచ్చు..! కానీ ఆమె తెలుగులో నటించిన సినిమా పేరు చెబితే మాత్రం కచ్చితంగా గుర్తుపడతారు. స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2004లో తెరకెక్కించిన చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’. ఈ మూవీలోని సన్నివేశాలు ఇప్పటికీ మీమర్స్‌కు పెద్ద ఫీస్ట్ మాత్రమే కాదు.. ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఈ చిత్రంలో అటు మొగుడు.. ఇటు లవర్ మధ్య నలిగిపోయిన మహిళ పాత్రలో కనిపించిన హీరోయిన్ మీకు గుర్తుండొచ్చు. ఆమె మరెవరో కాదు.. అమృత. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ హీరోయిన్ ఆ పాత్రలో నటించి మెప్పించింది.

అయితే అనూహ్యంగా ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు సినిమాలకు దూరమైంది. మొదటి సినిమాలో నటించిన పాత్ర తరహాలోనే ఆమెకు తదుపరి చిత్రాల్లోనూ రావడంతోనే ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారని తెలుస్తోంది. తెలుగు, కన్నడంతో పాటు ఇతర భాషల్లో కలిపి అమృత కేవలం 8 సినిమాల్లో మాత్రమే నటించారు. 2009లో ‘జోడి నెంబర్ 1’ అనే కన్నడ చిత్రం ఆమె నటించిన చివరి మూవీ. కాగా, వెండితెరకు దూరమైన అమృత.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉన్న అమృత బెంగుళూరులో గృహిణిగా స్థిరపడ్డారట.

Tollywood 1

Follow Us
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..