AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సూర్య కాంతి.. పెట్‌డాగ్‌.. మూణ్నెళ్ల తర్వాత సాయి పల్లవి పోస్ట్‌.. ఏమైపోయారంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు

ఎట్టకేలకు మౌనం విడింది సాయిపల్లవి. సుమారు మూణ్నెళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. సూర్యకాంతి పడేలా.. పెట్‌డాగ్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ 'హలో సన్‌ షైన్‌' అంటూ తన ఫాలోవర్లను పలకరించింది.

Sai Pallavi: సూర్య కాంతి.. పెట్‌డాగ్‌.. మూణ్నెళ్ల తర్వాత సాయి పల్లవి పోస్ట్‌.. ఏమైపోయారంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు
Sai Pallavi
Basha Shek
|

Updated on: Jan 10, 2023 | 6:23 PM

Share

తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. అయితే ఇటీవల ఈ న్యాచురల్‌ బ్యూటీ గురించి సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఆమె సినిమాలకు వీడ్కోలు పలకనుందని, వైద్యురాలిగా స్థిరపడనుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే గార్గి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు సాయి పల్లవి. కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్‌డేట్స్ కూడా లేవు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఎలాంటి పోస్టులు పెట్టలేదు. దీంతో ఈ అమ్మడికేమైంది? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే ఎట్టకేలకు మౌనం విడింది సాయిపల్లవి. సుమారు మూణ్నెళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. సూర్యకాంతి పడేలా.. పెట్‌డాగ్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ ‘హలో సన్‌ షైన్‌’ అంటూ తన ఫాలోవర్లను పలకరించింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది? ‘ఇన్ని రోజులు ఏమయ్యావ్‌?’ ‘నీ కొత్త సినిమా అప్‌డేట్స్‌ గురించి చెప్పు’ అంటూ ఫ్యాన్స్‌ రిక్వెస్టులు పెడుతున్నారు. కాగా 2022 అక్టోబరు 11 తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో సాయిపల్లవి పెట్టిన పోస్ట్‌ ఇదే.

కాగా సినిమా రంగానికి వీడ్కోలు పలుకుతుందంటూ వస్తోన్న వార్తలపై స్పందించిన సాయిపల్లవి ‘అందం అన్నది రూపంలో కాదని గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్‌ చిత్రంతో నా సినీప్రయాణం ప్రారంభమైంది. ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుందని అసలు ఊహించలేదు. ఆ చిత్రంలో టీచర్‌ ఇమేజ్‌ను మార్చడానికి వేరే తరహా పాత్రల్లో నటించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మంచి కథలు లభిస్తే భాషాభేదం లేకుండా నటించడానికి సిద్ధం’ అని చెప్పుకొచ్చింది. తద్వారా తనపై వస్తోన్న పుకార్లకు చెక్‌ పెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!