Nadiya: అత్తారింటికి దారేది ఫేం నదియా కూతుళ్లను చూసారా.. హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోరండోయ్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది నదియా. అందులో పవన్‌కు అత్తగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా నంది పురస్కారం లభించింది

Nadiya: అత్తారింటికి దారేది ఫేం నదియా కూతుళ్లను చూసారా.. హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోరండోయ్‌
Nadhiya
Follow us
Basha Shek

|

Updated on: Jan 12, 2023 | 9:21 PM

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది నదియా. అందులో పవన్‌కు అత్తగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా నంది పురస్కారం లభించింది. అంతకు ముందు ప్రభాస్‌ అమ్మ క్యారెక్టర్‌లోనూ నటించి మెప్పించారు. ఆ తర్వాత దృశ్యం, బ్రూస్‌లీ, అ..ఆ, సర్కారు వారిపాట, అంటే సుందరానికి, గని, ది వారియర్‌ తదితర సినిమాలతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెగ పాపులర్‌ అయిపోయారు. అయితే చాలామందికి తెలియని విషయమేమిటంటే నదియా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో స్టార్‌ హీరోల సరసన నటించారు. రజనీకాంత్, మోహన్‌లాల్‌, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, సురేష్ వంటి టాప్ హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారు. అయితే సినిమాల్లో ఉండగానే 1988లో అమెరికన్ బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్‌ను వివాహం చేసుకున్నారు నదియా. ఆతర్వాత ఫ్యామిలిలీతో కలిసి యూఎస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కాగా ఈ దంపతులకు 1996లో సనమ్‌ అనే కుమార్తె పుట్టింది. ఆతర్వాత ఐదేళ్లకు అంటే 2001లో రెండో అమ్మాయి జానా వీరి జీవితంలోకి అడుగుపెట్టింది.

ఆతర్వాత మళ్లీ ఇండియాకు తిరిగివచ్చిన నదియా ఫ్యామిలీ చెన్నైలోనే స్థిరపడింది. కాగా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు నదియా. అయితే అప్పుడప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను అందులో షేర్‌ చేస్తుంటారు. ఈ మధ్యన తన కూతుళ్ల ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేస్తున్నారు. అయితే ఈ ఫొటోలు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అందంలో అమ్మకు ఏమాత్రం తీసిపోరీ అక్కాచెల్లెళ్లు. అందులోనూ ఈ ముగ్గురిని ఒకే ఫ్రేములో చూసి అక్కాచెల్లెళ్లుగా ఉన్నారే కానీ తల్లి కూతుళ్లుగా మాత్రం కాదంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!