Spicejet Flight: ఢిల్లీ – పుణె స్పైస్‌జెట్ విమానానికి బాంబు బెదిరింపు .. అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో కలకలం…
పుణె వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందని అజ్ఞాత వ్యక్తి కాల్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి పూణెకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందని ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. బాంబు బెదిరింపు గురించి కాల్ అందుకున్న ఎయిర్‌లైన్ అధికారులు బోర్డింగ్‌ను ఆపివేసి, బాంబు స్క్వాడ్‌ను పిలిచారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, విమానంలో సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పారామిలటరీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు.
“సిఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. పుణె వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందని అజ్ఞాత వ్యక్తి కాల్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు.అనంతరం బాంబ్ స్క్వాడ్, ఎయిర్‌లైన్ అధికారులు కలిసి విమానాన్ని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చారు. దీంతో అటు ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…