- Telugu News Photo Gallery Ups chandauli place aurwatand rajdari devdari waterfall will be made a eco tourism hot spot in Telugu News
Tourism: ఎకో టూరిజం హాట్ స్పాట్.. అద్బుతమైన అందాలతో ప్రకృతిలో దాగివున్న రహస్య ప్రదేశం.. ఎక్కడో తెలుసా..?
నిజానికి, ఈ ప్రదేశం ఉత్తర ప్రదేశ్‌లోని చందౌలీలో ఉంది., దీనిని రాజదారి దేవదారి జలపాతం అని కూడా పిలుస్తారు. పర్వతం నుండి పడుతున్న జలధార, దాని చుట్టూ ఉన్న పచ్చదనం దృశ్యాలను చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడి ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఎకో-టూరిజం హాట్ స్పాట్‌గా సిద్ధం చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Updated on: Jan 12, 2023 | 8:30 PM

యూపీలో ప్రకృతి అందాలకు అద్దం పట్టే ఓ ప్రదేశం ఉంది. ప్రకృతిలో దాగివున్న ఈ రహస్య ప్రదేశం ఇప్పుడు ప్రభుత్వంచే ఎకో-టూరిజం హాట్ స్పాట్‌గా మారబోతోంది.. ఇక్కడి జలపాతం, పచ్చని పర్వతాలు, ప్రవహించే నీటి అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి.

చందౌలీ DM ఈ ప్రదేశాన్ని ఎకో-టూరిజం హాట్ స్పాట్‌గా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వం నుండి రూ. 2 కోట్ల డిమాండ్ చేశారు.

ఈ ప్రదేశం అసలు పేరు ఔర్వతండ్.. ఇది రాజ్దారి-దియోదరి జలపాతాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకాలం సరైన నిర్వహణ లేకపోవడం కారణంగా ఇలాంటి ప్రకృతి అందాల నిధి ఏళ్ల తరబడి అడవుల్లోనే దాగిపోయింది. పర్వతాలు,పచ్చని చెట్లతో నిండిపోయిన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు మంచి టూరిస్ట్ స్పాట్‌గా మారనుంది.

ఔర్వతాండ్ సహజమైన లోయతో ఏర్పడి ఉంది. ఇది దాని ప్రత్యేకతను కలిగి ఉందని DM చెప్పారు. రాక్ క్లైంబింగ్ సహా టైర్ నెట్ వాల్ వంటి అనేక సాహస క్రీడలను కూడా ఇక్కడ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఇది కాకుండా, ఎకో-టూరిజం హాట్ స్పాట్ ప్రధాన ద్వారం వద్ద స్థానిక రాళ్ళు, వెదురుతో దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు పార్కింగ్, టాయిలెట్ ఇతర అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.





























