Viral Video: ఇదేం వెర్రీ రా నాయనా.. జిమ్‌లో వర్కవుట్స్ ఇలా చేస్తారా ?.. పిచ్చిపట్టిందంటున్న నెటిజన్స్..

కానీ నిజానికి అతను విచిత్రమైన వ్యాయామం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా అతని విమర్శలతో కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

Viral Video: ఇదేం వెర్రీ రా నాయనా.. జిమ్‌లో వర్కవుట్స్ ఇలా చేస్తారా ?.. పిచ్చిపట్టిందంటున్న నెటిజన్స్..
Gym
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 12, 2023 | 7:30 PM

బాగా కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ ఏబ్స్ పెంచుకోవడానికి నేటి యువత ఎంతో ఇష్టపడుతున్నారు. ఇందుకోసం కొందరు జిమ్‌కి వెళ్లి గంటల తరబడి చెమటలు కక్కుతున్నారు. కొంతమందిలో ఈ అభిరుచి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు జిమ్‌లో వింత వింత వ్యాయామాలు చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు చూడా షాక్‌ అవుతారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ కుర్రాడు జిమ్‌లో వింత వర్కవుట్ చేస్తూ కనిపించాడు. ఈ క్లిప్‌ను కొన్ని సెకన్ల పాటు చూసిన తర్వాత, ప్రజలు దానిపై తీవ్రమైన కామెంట్ చేస్తున్నారు.

వైరల్ అయిన వీడియోలో, చాలా మంది జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నారు. కానీ వారిలో ఒకరు వింతగా చేయడం వల్ల అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. వీడియోలో వ్యక్తి మెడకు బెల్ట్‌తో కట్టేసుకుని, చేతిలో బరువు బరువుపట్టుకుని, శరీరాన్ని పైకి లిఫ్ట్‌ చేస్తున్నాడు. దూరం నుంచి చూసిన వారెవరైనా ముందుగా ఆ వ్యక్తిని చూసి షాక్‌ అవ్వాల్సిందే.. ఎందుకంటే..అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నాడా ఏంటని భయపడిపోతారు.. కానీ నిజానికి అతను విచిత్రమైన వ్యాయామం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా అతని విమర్శలతో కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొన్ని సెకన్ల వీడియోను @BornAKang అనే హ్యాండిల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ క్లిప్‌ను ఇప్పటివరకు 46 లక్షలకు పైగా వీక్షించగా, దాదాపు 96 వేల మంది లైక్ చేశారు. ఇది కాకుండా, వినియోగదారులు ఈ వీడియోపై భారీగా స్పందిస్తున్నారు. తీవ్రమైన కామెంట్లతో వీడియోను మరింతగా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..