Kidney stone: కిడ్నీ స్టోన్ ఉన్నవారు ఈ 5 రకాల పండ్లను అస్సలు తినకూడదు.. టచ్‌ చేశారో…

అధిక నీటి శాతం కలిగిన పండ్లు కిడ్నీ బాధితులకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, కిడ్నీ స్టోన్ రోగులకు పండ్లు తినడం పరిమితమనే చెబుతున్నారు వైద్య నిపుణులు.

Kidney stone: కిడ్నీ స్టోన్ ఉన్నవారు ఈ 5 రకాల పండ్లను అస్సలు తినకూడదు.. టచ్‌ చేశారో...
Fruits
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 12, 2023 | 5:01 PM

మానవ శరీరంలో మూత్రపిండాలు శరీరానికి ఫిల్టర్ వంటివి అంటారు. మానవ శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు మూత్రపిండాలు పనిచేస్తాయి. ఈ కారణంగా ఆ వ్యక్తి వ్యాధుల ప్రమాదానికి దూరంగా ఉండగలడు. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ అత్యంత ముఖ్యమైన అవయవం. కానీ, మారిన జీవనశైలి, చెడు ఆహారపుటలవాట్లు వంటి అనేక కారణాల వల్ల ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడేవారు విపరీతమైన కడుపునొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. అంతే కాకుండా కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు కొన్ని పండ్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.. అలాంటి తినకూడని పండ్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

వాస్తవానికి, మంచి ఆరోగ్యానికి ఆకుపచ్చ కూరగాయలు ఎంత ముఖ్యమో పండ్లు కూడా అంతే ముఖ్యం. పండ్లు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు మంచినీళ్లు, పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష వంటి వాటిని ఎక్కువగా తీసుకోవటం ఉత్తమం. అధిక నీటి శాతం కలిగిన పండ్లు కిడ్నీ బాధితులకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, కిడ్నీ స్టోన్ రోగులకు పండ్లు తినడం పరిమితమనే చెబుతున్నారు వైద్య నిపుణులు.

కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారికి ఈ పండ్లు ప్రమాదకరం: కిడ్నీ స్టోన్ వ్యాధి ఉన్నవారు కొన్ని పండ్లను తినకుండా ఉండాలి. ఆక్సలేట్స్ అధికంగా ఉండే పండ్లను తినకూడదని అంటారు. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, దానిమ్మ, నిమ్మ, డ్రై ఫ్రూట్స్ తినకూడదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..