AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Food: డేంజరస్‌ రెసిపీ.. పాములు, తేళ్లతో స్పెషల్ సూప్..! ఎంజాయ్ చేస్తున్న భోజనప్రియులు..

ఇందుకోసం దాదాపు 3 గంటల పాటు పాములు, తేళ్లను ఉడికిస్తారు.. దీని తరువాత పంది మాంసం, పాము, అల్లం, వెల్లుల్లి, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో ఒక వంటగిన్నెలో కలిసి కుక్‌ చేస్తారు. దీనికి కొన్ని కూరగాయలు కూడా కలుపుతారు.

Dangerous Food: డేంజరస్‌ రెసిపీ.. పాములు, తేళ్లతో స్పెషల్ సూప్..! ఎంజాయ్ చేస్తున్న భోజనప్రియులు..
Scorpion Snake Soup
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2023 | 3:22 PM

Share

మీరు చాలా విచిత్రమైన అన్యదేశ వంటకాల గురించి వినే ఉంటారు. అయితే ఈరోజు మేము మీకు ఒక భయంకరమైన వంటకం గురించి తెలియజేస్తున్నాము. ఇదేంటో తెలిస్తే మాత్రం మీ ఒళ్లు గగ్గుర్పాటుకు గురికావాల్సిందే.. ఇక వేసవి రాకతో చైనాలో మాత్రం ఈ వంటకానికి ఫుల్‌ డిమాండ్ పెరుగుతుంది. ఇకపోతే, ఈ వంటకం చేయడానికి విషపూరితమైన పాములు, తేళ్లను ఉపయోగిస్తారని తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కళ్లు తిరిగి పడిపోతారు. అందిన సమాచారం ప్రకారం..ఈ భయానక వంటకాన్ని చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత విషపూరితమైన జీవులలో పాములు,తేళ్లు ఈ రెండింటీని ఈ వంటకంలో ఉపయోగిస్తారు. పాములు,తేళ్ల మిశ్రమంతో తయారు చేయబడిన ఈ సూప్ దక్షిణ చైనాలో కనిపిస్తుంది. దానికి పంది మాంసం కూడా కలుపుతారు. అదనంగా దీనికి ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతారు.

ఈ ప్రత్యేకమైన సూప్ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుందని చైనీయుల నమ్మకం. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకర అంశం ఏంటంటే.. ఈ సూప్ అక్కడి వంటకాలు, సంస్కృతిలో ఒక భాగమని చెబుతున్నారు. కానీ అక్కడ ఉన్న అన్ని రెస్టారెంట్లలో ఈ వంటకం అందుబాటులో ఉండదు. ఈ వంటకం కొన్ని ప్రత్యేక రెస్టారెంట్లలో మాత్రమే దొరుకుతుంది. ఇది అనుభవజ్ఞులైన చెఫ్‌లచే మాత్రమే తయారు చేయబడుతుంది. తేళ్లు, పాములను ఉపయోగించే ముందు వాటి నుండి విషాన్ని ఎలా తొలగించాలో ఈ కుక్‌లకు మాత్రమే తెలుస్తుందట.

ఈ సూప్ ఎలా తయారు చేస్తారు? ఈ వంటకాన్ని తయారుచేసే ముందు పాము, తేలు విషాన్ని సంగ్రహిస్తారు. ఇందుకోసం దాదాపు 3 గంటల పాటు పాములు, తేళ్లను ఉడికిస్తారు.. దీని తరువాత పంది మాంసం, పాము, అల్లం, వెల్లుల్లి, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో ఒక వంటగిన్నెలో కలిసి కుక్‌ చేస్తారు. దీనికి కొన్ని కూరగాయలు కూడా కలుపుతారు. దీని తరువాత, తేలు రసం దానిలో కలుపుతారు. చైనీయులు దీని రుచిని చాలా ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్