Diamonds: కళ్లు జిగేల్‌.. 26,200 వజ్రాలతో దగదగ మెరిసే ఉంగరం.. గిన్నిస్ బుక్ రికార్డ్‌ బ్రేక్ చేయబోతోంది..!

ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 8 నుంచి 10 మంది కళాకారులు మూడు నెలల పాటు శ్రమించారని తెలిపారు. ఇది రెండు వేళ్లకు పెట్టవచ్చు. ఈ ఉంగరం కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేశామని,

Diamonds: కళ్లు జిగేల్‌.. 26,200 వజ్రాలతో దగదగ మెరిసే ఉంగరం.. గిన్నిస్ బుక్ రికార్డ్‌ బ్రేక్ చేయబోతోంది..!
Dazzling Jewellery
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 11, 2023 | 8:38 PM

ఉంగరం పెద్దదైతే రెండు వజ్రాలు ఉండడం సహజమే. కానీ, ఇక్కడ తయారైన ఈ ఉంగరంలో ఏకంగా 26,200 వజ్రాలు పొదిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన డాజ్లింగ్ జ్యువెలరీ అనే ఆభరణాల తయారీ సంస్థ ఈ ఉంగరాన్ని తయారు చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలు పొదిగిన ఉంగరంగా రికార్డు సృష్టించనుంది. అత్యధిక వజ్రాలున్న ఈ పూల ఆకారంలో ఉండే ఉంగరం చూపరులను ఆకట్టుకుంటుంది. డాజ్లింగ్ జ్యువెలరీ యజమాని విపుల్ అగర్వాల్ ఉంగరానికి ‘దేవ్ ముద్రిక’ అని పేరు పెట్టారు.

గతంలో దక్షిణాదికి చెందిన ఓ కంపెనీ 24 వేల వజ్రాలు పొదిగించి ఉంగరాన్ని తయారు చేసిందని విపుల్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు అని తెలిపారు. ఇప్పుడు 26,200 వజ్రాలతో ఉంగరాన్నితయారు చేసి రికార్డుకు సిద్ధమయ్యామని చెప్పారు. ఈ రింగ్ డిజైన్‌ను మొదట సాఫ్ట్‌వేర్ రూపొందించి, ఆపై కళాకారులు తయారు చేశారని విపుల్ అగర్వాల్ వెల్లడించారు.

ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 8 నుంచి 10 మంది కళాకారులు మూడు నెలల పాటు శ్రమించారని తెలిపారు. ఇది రెండు వేళ్లకు పెట్టవచ్చు. ఈ ఉంగరం కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేశామని, రికార్డు నిర్ధారించిన తర్వాత ఉంగరం ధరను నిర్ణయిస్తామని అగర్వాల్ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..