Delhi crime: దేశ రాజధాని ఢిల్లీలో మరో మహిళ దారుణ హత్య.. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన దుండగులు.. పోలీస్‌ విచారణలో..

జనవరి 11న మహిళ మృతదేహాన్ని శ్మశానవాటిక నుండి బయటకు తీశారు పోలీసులు. హత్యకు గురైన మృతురాలి పేరు మీనా అని గుర్తించారు.. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.

Delhi crime: దేశ రాజధాని ఢిల్లీలో మరో మహిళ దారుణ హత్య.. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన దుండగులు.. పోలీస్‌ విచారణలో..
Delhi Crime
Follow us

|

Updated on: Jan 12, 2023 | 3:38 PM

దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 54 ఏళ్ల హిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. బుధవారం (జనవరి 11) మహిళ మృతదేహాన్ని శ్మశానవాటిక నుండి బయటకు తీశారు పోలీసులు. హత్యకు గురైన మృతురాలి పేరు మీనా అని గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. 54 ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారిని రెహాన్ (మంగలి), మోబిన్ ఖాన్ (ఆటో రిక్షా డ్రైవర్),నవీన్ (టైలర్), సయ్యద్ అలీ (శ్మశానవాటిక వాచ్‌మెన్‌)గా గుర్తించారు. ఇదిలా ఉంటే, మరోవైపు జనవరి 2 నుంచి మీనా కనిపించడం లేదని ఆమె బంధువులు మంగోల్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మోబిన్‌పై అనుమానం వ్యక్తం చేశారు మీనా కుటుంబీకులు.

మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు మీనా కోసం వెతకడం ప్రారంభించారు. మరోవైపు మీనా కుటుంబీకులు మోబిన్ ఖాన్‌ను అనుమానించారు. అతను మీనాతో చనువుగా ఉంటాడని, మృతురాలి బంధువులు పోలీసులకు తెలిపారు. కుటుంబీకుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు మోబిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బట్టబయలైంది. మోబిన్ మొత్తం హత్య కేసును వెల్లడించాడు. మరో ముగ్గురు నిందితులను (రెహాన్, నవీన్, సయ్యద్ అలీ) కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మీనా ఫైనాన్స్‌లో పనిచేసేదని, ముగ్గురు నిందితులు మీనా కోసమే పని చేసేవారని పోలీసు వర్గాలు తెలిపాయి. ముగ్గురూ డబ్బు విషయంలో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. డబ్బు తిరిగివ్వాలని మీనా ముగ్గురిపై ఒత్తిడి తెచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కారణంగానే మీనాను హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..