Maruti Suzuki EVX: మారుతి నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 550 కిలోమీటర్ల మైలేజీ.. అద్భుతమైన ఫీచర్స్
భారతదేశపు ఆటో మొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మరో అడుగు ముందుకువేసింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో 500 కిలోమీటర్ల రేంజ్ ను అధిగమించింది. దీని కోసం ఎలక్ట్రిక్ కార్ల ఎస్ యూవీ విభాగంలో సరికొత్త ఈవీఎక్స్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశపు ఆటో మొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మరో అడుగు ముందుకువేసింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో 500 కిలోమీటర్ల రేంజ్ ను అధిగమించింది. దీని కోసం ఎలక్ట్రిక్ కార్ల ఎస్ యూవీ విభాగంలో సరికొత్త ఈవీఎక్స్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. ఆటో ఎక్స్ పో 2023లో దీనికి సంబంధించిన మోడల్ ను మారుతి సుజుకి ఆవిష్కరించింది. దీనితో పాటు ఏకంగా 16 రకాల మోడళ్లను ఎక్స్ పో లో ఆ సంస్థ ప్రదర్శించింది. వాటిలో గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, సియాజ్, ఎర్టిగా, బ్రెజ్జా, వ్యాగన్ ఆర్, ఫ్లెక్స్ ఫ్యూయల్, బాలెనో, స్విఫ్ట్ వంటి మోడళ్లు ఉన్నాయి.
సరికొత్త ఎస్ యూవీ స్పెసిఫికేషన్స్..
మారుతీ సుజుకీ సరికొత్త ఎస్ యూవీ మోడల్ ఎలక్ట్రిక్ కారు 4,300 మిల్లీ మీటర్ల పొడవు, 1,800 మిల్లీమీటర్ల వెడల్పు, 1,600 మిల్లీ మీటర్ల ఎత్తు కలిగి ఆకర్షణీయమైన డిజైన్ తో రానుంది. దీనిలో 60 kwh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఈ బ్యాటరీ సేఫ్ బ్యాటరీ టెక్నాలజీతో దాదాపు ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఆ కంపెనీ ప్రకటించుకుంది.
మరిన్ని కొత్త రకాలు..
మారుతి సుజుకీ తన సరికొత్త ఎస్ యూవీ తో పాటు మరిన్ని రకాల కార్లను ఎక్స్ పోలో ప్రదర్శించింది. వాటిలో వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్, బ్రెజ్జా ఎస్ సీఎన్జీ, గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హై బ్రీడ్ మోడళ్లను ఆవిష్కరించింది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్.. ఈ కార్ ఈ85(E85) ఇంధనంతో నడుస్తుంది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు 20 నుంచి 85 శాతం ఇథనాల్ మిశ్రమంతో నడుస్తాయి. దీని సామర్థ్యం అధికంగా ఉండటంతో పాటు నిర్వహణ కూడా తక్కువగా ఉంటుంది.
మారుతి సుజుకి బ్రెజ్జా S-CNG.. మర్కెట్ లోకి ఇంకా విడుదల చేయని బ్రెజ్జా S-CNGని మోడల్ ను ఎక్స్‌పోలో మారుతి సుజుకి ప్రదర్శించింది. ఈ కంపెనీ ఏకంగా 14 S-CNG వాహనాలను కలిగి ఉంది.
గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ హైబ్రిడ్.. ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్, ఇ-సివిటి ట్రాన్స్‌మిషన్‌తో గ్రాండ్ విటారాను ఆ కంపెనీ ఆవిష్కరిస్తోంది. ఇది 27.97 కిమీ సామర్థ్యంతో వస్తోంది.
లక్ష్యం.. కర్బన ఉద్గారాలను తగ్గించడమే..
ఈ సందర్భంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రతినిధి, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి మాట్లాడుతూ తాము కార్ల నుంచి ఉత్పన్నమయ్యే గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తమ వాహన శ్రేణులను సిద్ధం చేస్తున్నామన్నారు. దీని కోసం అత్యుత్తమ బ్యాటరీల తయారు చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై రానున్న కాలంలో మొత్తం 100 బిలియన్ రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్ల పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..