Air Strike: టెర్రరిస్టులపై వైమానిక దాడులు.. మిజోరాం సరిహద్దుల్లోని గ్రామాల్లో హైటెన్షన్‌.. ఎంతమంది హతమయ్యారంటే..

చైనా- భారత్ సరిహద్దు గ్రామాలు వణికిపోతున్నాయి. బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. భారతదేశంలోని మిజోరాం సరిహద్దులోని టెర్రరిస్టు శిబిరంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడులు చేస్తోంది.

Air Strike: టెర్రరిస్టులపై వైమానిక దాడులు.. మిజోరాం సరిహద్దుల్లోని గ్రామాల్లో హైటెన్షన్‌.. ఎంతమంది హతమయ్యారంటే..
Myanmar Air Strike
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 12, 2023 | 3:16 PM

భారత – మయన్మార్‌ సరిహద్దు గ్రామాల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. చైనా నేషనల్‌ ఆర్మీ తీవ్రవాదుల క్యాంప్‌లపై మయన్మార్‌ ఎయిర్‌ఫోర్స్‌ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయడంతో మిజోరం లోని సరిహద్దు గ్రామాల ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. మిజోరం సరిహద్దుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఈ దాడులు జరిగాయి. అయితే భారత భూభాగంలో మయన్మార్‌ వైమానిక దాడులు జరపలేదని ఇండియన్‌ ఆర్మీ స్పష్టం చేసింది. మయన్మార్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడుల్లో చాలామంది తీవ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది. భారతదేశంలోని మిజోరాం ప్రక్కనే ఉన్న సరిహద్దులో తిరుగుబాటు-సంస్థల శిబిరంపై మయన్మార్ సైన్యం భారీ వైమానిక దాడిని చేపట్టింది. ఈ దాడిలో మయన్మార్‌లోని తిరుగుబాటు సంస్థలకు చెందిన కొందరు వ్యక్తులు మరణించినట్లుగా సమాచారం. అయితే ఈ వైమానిక దాడి భారత సరిహద్దులో ఎటువంటి నష్టం జరగలేదని భారత భద్రతకు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.

మంగళవారం (జనవరి 10) మయన్మార్ జుంటా (మిలిటరీ ప్రభుత్వం) సూచనల మేరకు విక్టోరియా క్యాంప్ ఆఫ్ చిన్ నేషనల్ ఆర్మీ (సీఎన్ఏ) పై వైమానిక దాడులు చేసింది. మయన్మార్ సైనిక పాలనకు వ్యతిరేకంగా చిన్ నేషనల్ ఆర్మీ తిరుగుబాటును ప్రారంభించింది. సీఎన్ఏ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో మయన్మార్ సరిహద్దులో ఉన్న విక్టోరియా క్యాంప్‌లో ఉంది. ఈ ప్రధాన కార్యాలయంపై మయన్మార్ సైన్యం తన యుద్ధ విమానాల నుంచి బాంబులను జారవిడిచింది. ఈ బాంబు దాడిలో సీఎన్ఏ సభ్యులు పెద్ద ఎత్తున చనిపోయి ఉంటారని తెలుస్తోంది.

భారత్‌పై బాంబులు వేయలేదు..

ఈ వైమానిక దాడుల తర్వాత భారత్ వైపు కూడా కొన్ని బాంబులు పడినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని మయన్మార్ ప్రభుత్వం తెలిపింది. జరిగిన దాడిలో ఎంత ప్రాణ నష్టం జరిగిందనే అంశంపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. మిజోరాంలో పోస్ట్ చేయబడిన విశ్వసనీయ భారతీయ వర్గాలు బాంబులు పడిపోయినట్లు చెప్పబడుతున్న ప్రాంతాల్లో అలాంటిదేమీ గుర్తించలేదని స్పష్టం చేసింది. చిన్ నేషనల్ ఆర్మీ పట్ల సానుభూతి ఉన్న వ్యక్తులు ఈ పుకారు వ్యాపింపచేస్తున్నారని తెలిపింది.

తన సరిహద్దులో వైమానిక దాడులు..

మయన్మార్‌తో సరిహద్దు భద్రతను అస్సాం రైఫిల్స్ పర్యవేక్షిస్తోంది. మయన్మార్ సైన్యం చేపట్టిన వైమానిక చర్య వారి భూభాగంలోనే జరిగిందని ఢిల్లీలోని దేశ భద్రతకు సంబంధించిన ఉన్నత స్థాయి వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఈ చర్య భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపాయి.

మయన్మార్‌లో సైనిక పాలన

మయన్మార్‌లో గత రెండేళ్లుగా మిలటరీ పాలన కొనసాగుతుండగా.. దానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాటు సంస్థలు ఉద్యమిస్తున్నాయి. ఈ తిరుగుబాటు సంస్థలు భారత్‌కు ఆనుకుని ఉన్న సరిహద్దు నుంచి పనిచేస్తున్నాయి. మంగళవారం నాటి వైమానిక దాడికి ముందు కూడా మయన్మార్ సైన్యం భారతదేశంతో సరిహద్దుకు దగ్గరగా ఉన్న తిరుగుబాటు సంస్థలపై కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 2019లో కూడా మయన్మార్ సైన్యం అరకాన్-ఆర్మీకి వ్యతిరేకంగా కచిన్ తిరుగుబాటు బృందం మద్దతుతో ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది.

మరిన్ని జాతీయవార్తల కోసం