AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పళ్లతో ట్రక్కు లాగిన వ్యక్తి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.. వైరలవుతున్న వీడియో చూస్తే అవాక్కే…!

ఈ క్లిప్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సర్వత్రా వైరల్‌గా మారింది.

Watch: పళ్లతో ట్రక్కు లాగిన వ్యక్తి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.. వైరలవుతున్న వీడియో చూస్తే అవాక్కే...!
Guinness World Record
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2023 | 4:09 PM

Share

ఈజిప్టులో ఓ వ్యక్తి తన పళ్లతో 15,730 కిలోల ట్రక్కును లాగాడు. ఈ వ్యక్తి ‘పళ్ళతో లాగబడిన అత్యంత బరువైన రహదారి వాహనం’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు.  ఈజిప్ట్ కి చెందిన అష్రాఫ్ మహ్రౌస్ మహమ్మద్ సులీమాన్ పళ్లతో అత్యంత బరువైన రోడ్డు వాహనాన్ని లాగిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ బృందం గుర్తించింది. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ప్రకటించింది. పళ్లతో ట్రక్కును లాగుతున్న వీడియోను సైతం పోస్ట్ చేసింది.

ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. లైకులు, కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. ఒక్కోక్కరూ ఒక్కో విధంగా తమ దైన శైలిలో స్పందించారు. వీడియో చూసినఓ యూజర్ హాస్యంగా స్పందించాడు. ఆయన్ను చూసే డెంటిస్ట్ ఎవరో కానీ, నేను కూడా వెంటనే వెళ్లి కలవాలి అంటూ కామెంట్ చేశాడు. ఆయన దంతాలే ఆయనకున్న బలం, ఆయన దంతాలే ఆయన కండరాలు, తన చేతుల కంటే ఆయన దంతాలే గట్టివి అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇంటర్‌ నెట్‌ వినియోగదారులు..

ఇవి కూడా చదవండి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఈ రికార్డును 13 జూన్ 2021న ఈజిప్ట్‌లోని ఇస్మాలియాలో అష్రఫ్ మహ్రూస్ మహ్మద్ సులిమాన్ సృష్టించారు. ఈ క్లిప్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సర్వత్రా వైరల్‌గా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…