AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కటకటాల్లో ఖైదీ కన్నయ్య పాడిన పాట.. అతని జీవితాన్నే మార్చేసింది.. వైరలవుతున్న వీడియో..

ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ అంకిత్‌ తివారీ సైతం కన్నయ్య పాటకు ఫిదా అయ్యారు. ఈ మేరకు అతనికి పాట పాడే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కన్నయ్యకు నా మ్యూజిక్‌ కంపెనీలో పాట పాడే అవకాశం ఇస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు.

కటకటాల్లో ఖైదీ కన్నయ్య పాడిన పాట.. అతని జీవితాన్నే మార్చేసింది.. వైరలవుతున్న వీడియో..
Pawan Singh
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2023 | 4:41 PM

Share

సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చాలా రకాల వైరల్‌ ఫోటోలు, వీడియోలు హల్‌చల్‌ చేస్తుంటాయి. కొన్నికొన్ని సార్లు అలాంటి వీడియోలు, ఫోటోలు సామాన్యుడిని రాత్రికి రాత్రే సూపర్‌స్టార్‌ని చేస్తాయి. అలాంటి ఘటనే ఇది కూడా. ఇటీవల జైలులో ఉన్న ఒక వ్యక్తి బాధాకరమైన భోజ్‌పురి పాటను పాడుతున్న వీడియో వైరల్ మారింది. అవును, జైల్లో కూర్చొని ఓ వ్యక్తి హమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ పాటను శ్రావ్యమైన స్వరంతో పాడుతున్నాడు. అయితే, ఈ వీడియోలో వ్యక్తి ముఖం కనిపించదు, కానీ అతని మధురమైన స్వరం మిలియన్ల మంది హృదయాలను చేరుకుంది. ఈ పాట వీడియో వైరల్‌గా మారగా, ఈ వ్యక్తికి అదృష్టం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. రాజకీయ నాయకుల నుండి బాలీవుడ్ ప్రముఖుల వరకు అందరూ ఆ వ్యక్తిని ప్రశంసించారు.

వాస్తవానికి, డియోరియా ఎమ్మెల్యే డాక్టర్ శల్భమణి త్రిపాఠి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో, జైలు ఊచల వెనుక నుండి, ఒక వ్యక్తి చాలా అందమైన గొంతుతో బాధా తప్తహృదయంతో భోజ్‌పురి పాటను పాడటం వినబడుతుంది. అతని ముఖం కనిపించడం లేదు కానీ.. ఎమ్మెల్యే ఎవరనే విషయాన్ని బయటపెట్టారు. బీహార్‌కు చెందిన కన్నయ్య కుమార్‌.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న కారణంతో బుక్సర్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దీంతో జైల్లో ఉన్న కన్నయ్య.. అక్కడ భోజ్‌పూర్‌ పాట పాడినట్టుగా ఆయన వెల్లడించారు. ఈ పాటను రికార్డ్‌ చేసిన జైలు అధికారులు.. వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దాంతో కన్నయ్య పాడిన పాట వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. కన్నయ్య పాట వీడియో చూసిన నెటిజన్లు కన్నయ్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, వీడియో చూసిన పలువురు టాప్‌ సింగర్లు కన్నయ్యకు పాట పాడే అవకాశం కల్పిస్తున్నారు. ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ అంకిత్‌ తివారీ సైతం కన్నయ్య పాటకు ఫిదా అయ్యారు. ఈ మేరకు అతనికి పాట పాడే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కన్నయ్యకు నా మ్యూజిక్‌ కంపెనీలో పాట పాడే అవకాశం ఇస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..