Quick Glowing skin tips: మిల్కీ స్కిన్ పొందడానికి మూడు సూపర్ టిప్స్..! ప్రయత్నించి చూడండి.. ఫలితం నిగారింపు
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ముఖం కడుక్కోవాలి. మార్పు మీరే గమనిస్తారు..
పాలు ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఎముకలను బలోపేతం చేయడంలో దీని గుణాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే పాలను చర్మానికి పట్టించడం వల్ల చర్మం కూడా మెరుగుపడుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పచ్చి పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. పాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లు చర్మ మలినాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే మంచి ఫలితాలను పొందడానికి పచ్చి పాలను చర్మానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మెరిసే చర్మ చిట్కాలు: పాలు ఆరోగ్యానికి అనేక పోషకాలను అందిస్తాయి. ఎముకలను బలోపేతం చేయడంలో దీని గుణాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే పాలను చర్మానికి పట్టించడం వల్ల చర్మం కూడా మెరుగుపడుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పచ్చి పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. పాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లు చర్మ మలినాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే మరింత మెరుగైన, మంచి ఫలితాలను పొందడానికి పచ్చి పాలను చర్మానికి ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
పచ్చి పాలు, పిండి: ఎక్కువగా పొడిబారినప్పుడు చర్మం అందవిహీనంగా మారుతుంది. ఈ గ్లో తిరిగి రావాలంటే పచ్చి పాల ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం.. ముందుగా ఒక గిన్నెలో 2 చెంచాల శెనగపిండిని తీసుకుని అందులో పచ్చి పాలు, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ముఖం కడుక్కోవాలి. మార్పు మీరే గమనిస్తారు..
పాలు, కుంకుమపువ్వు: ముఖానికి సహజమైన మెరుపు రావాలంటే కుంకుమపువ్వు ఉన్న ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించాలి. అయితే దీని కోసం పచ్చి పాలను తీసుకుని అందులో కుంకుమపువ్వు వేసి చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి.
పాలు, తేనె: తేనెను పాలలో కలిపి చర్మానికి రాసుకుంటే మంచిదని బ్యూటీషన్లు చెబుతున్నారు. ఈ మిశ్రమంలోని గుణాలు చర్మాన్ని ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ముఖం కోల్పోయిన మెరుపును తిరిగి తీసుకురావడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది పొడిబారిన తత్త్వాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..