Trending Video: గురుద్వారాలో రోటీలు చేసిన అమెరికన్ బ్లాగర్.. ఇండియన్ కల్చర్ కు ఫుల్ ఫిదా..
భారతదేశం ఎన్నో రకాల సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. అందుకే విదేశీయులు కూడా భారత్ లోని భిన్నత్వంలో ఏకత్వం చూసి మురిసిపోతుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ అమెరికన్ బ్లాగర్, చెఫ్ ఈటాన్ బెర్నాథ్ తన కుటుంబంతో కలిసి...

భారతదేశం ఎన్నో రకాల సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. అందుకే విదేశీయులు కూడా భారత్ లోని భిన్నత్వంలో ఏకత్వం చూసి మురిసిపోతుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ అమెరికన్ బ్లాగర్, చెఫ్ ఈటాన్ బెర్నాథ్ తన కుటుంబంతో కలిసి ఇండియాలో పర్యటిస్తున్నారు. వారు గోవా, జైపూర్, పట్నా, ఢిల్లీతో సహా అనేక భారతీయ నగరాలను సందర్శిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఒక గురుద్వారాలో నివాళులర్పించాడు. అక్కడ రోటీలు కూడా ఇచ్చాడు. అమెరికన్ చెఫ్ తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇది వైరల్‌గా మారింది. భారతీయ వినియోగదారులు ఈ వీడియోపై తమ ప్రేమను చాటుకుంటున్నారు.
వైరల్ వీడియోలో.. అమెరికన్ చెఫ్ తన కుటుంబంతో కలిసి గురుద్వారాలో కూర్చుని ఉండటాన్ని చూడవచ్చు. ఆయన సంప్రదాయ కండువా కప్పుకున్నాడు. తన అభిమానులకు కమ్యూనిటీ కిచెన్ గురించి వివరిస్తున్నాడు. ఆహారాన్ని ఎలా వండుతారనే విషయాన్ని చక్కగా వివరించాడు. చెఫ్‌లు కూడా రోటీలు చూడటాన్ని వీడియోలో చూడవచ్చు. అలా చేయడం తనకు ఎలాంటి ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చిందో తన అభిమానులకు తెలియజేశాడు. వీడియోలో కనిపిస్తున్న రోటీ యంత్రం ప్రతి గంటకు 4000 రోటీలను తయారు చేయగలదు.




View this post on Instagram
వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకు 66.7 వేలకు పైగా లైక్స్, 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..