Vande Bharat Express: సీసీ ఫుటేజ్ ద్వారా వందేభారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన నిందితుల గుర్తింపు.. వీరు ఎవరంటే..

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన నిందితుల పోలీసులు గుర్తించారు. ట్రైన్‌కు అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ద్వారా నిందితులకు పట్టుకున్నారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నా..

Vande Bharat Express: సీసీ ఫుటేజ్ ద్వారా వందేభారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన నిందితుల గుర్తింపు.. వీరు ఎవరంటే..
Follow us

|

Updated on: Jan 12, 2023 | 9:49 PM

విశాఖ కంచరపాలెం వద్ద వందేభారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన నిందితుల పోలీసులు గుర్తించారు. ట్రైన్‌కు అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ద్వారా నిందితులకు పట్టుకున్నారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నా విశాఖ పోలీసులు. శంకర్, దిలీప్, చందుగా గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. బుధవారం కంచరపాలెంలో నిలిపి ఉంచిన వందేభారత్ ట్రైన్ పై దుండగులు రాళ్ల దాడి చేశారు. కంచరపాలెంలోని రామ్మూర్తి పంతులు గేట్‌ దగ్గర దుండగులు దాడి చేయడంతో.. రెండు కోచ్‌లకు సంబంధించిన అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ దాడి కేసులో కీలకంగా సీసీ ఫుటేజ్‌ కీలకంగా మారింది. శంకర్‌, దిలీప్‌, చందును అనుమానితులుగా గుర్తించారు. మద్యం మత్తులో రాళ్లు రువ్వారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో నిందితులను అరెస్ట్‌ చేస్తామంటున్నారు పోలీసులు. ఈ దాడిలో వందే భారత్ రైలు రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖకు వందే భారత్ రైలు వచ్చింది.

సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు పెట్టడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వందే భారత్  ఎక్స్ ప్రెస్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్‌గా వందేభారత్ రైలు ప్రారంభించాల్సి ఉంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా వందేభారత్ రైలు వైజాగ్ వరకు రన్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ఈ ట్రైన్ ను మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు. అయితే ట్రాక్ అప్ గ్రడేషన్ పనులు విజయవాడ-విశాఖపట్నం మధ్య పూర్తి కావడమే కాదు పలువురు నేతలు వందే భారత్ ను విశాఖపట్నం వరకు పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. టికెట్ ధరలను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. టికెట్ ధరలను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు నాటికి 75 వందేభారత్ ఎక్స్‭ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 80 శాతం స్థానికంగా దొరికిన వస్తువులతోనే నిర్మాణం పూర్తిగా ఇండియాలోనే జరిగింది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం