AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti: హద్దు మీరుతున్న ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలు.. అధిక ఛార్జీలతో సామాన్యుడి జేబు గుల్ల..

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతాయి. వివిధ ప్రాంతాల నుంచి నగరంలో స్థిరపడిన వారందరూ పెద్ద పండుగకు...

Sankranti: హద్దు మీరుతున్న ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలు.. అధిక ఛార్జీలతో సామాన్యుడి జేబు గుల్ల..
Sankranti Rush
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 13, 2023 | 7:23 AM

Share

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతాయి. వివిధ ప్రాంతాల నుంచి నగరంలో స్థిరపడిన వారందరూ పెద్ద పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రయాణీకులతో బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దీన్ని అదనుగా తీసుకుని పలువురు ట్రావెలర్స్ దోపిడీకి పాల్పడుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అడ్డుఅదుపూ లేకుండా దోచుకుంటున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తరలి వస్తున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ధరలకు అనుగుణంగానే టికెట్‌ ధరలు ఉండాలనే రవాణాశాఖ అధికారుల సూచనలను తుంగలో తొక్కేస్తున్నారు.

టికెట్లు బుక్‌ చేసుకునేందుకు అనేక రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్‌ చేసినప్పుడు ఒక ధర.. బుక్‌ చేసుకునే సమయానికి మరో ధర చూపిస్తోంది. ఇంచుమించుగా అన్ని యాప్‌ల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీఓ అధికారులు సూచించిన ధరల కంటే అధికంగా దోచుకుంటున్నారు. అయితే.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు చేపట్టాల్సిన ఆర్టీఓ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటున్నారని ప్రయాణీకులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తున్నామని పేరుకే తప్ప.. ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శిస్తున్నారు.

మరోవైపు.. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద సాయంత్రం సమయంలో ప్రైవేట్‌ బస్సుల వలన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం