Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. ఆపరేషన్ ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన వైద్యులు

పుష్పమ్మకు ఆపరేషన్‌ చేయాలని చెప్పిన వైద్యులు ఎక్స్‌రే, స్కానింగ్ టెస్ట్‌లు బయట ప్రైవేట్‌గా చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సర్జరీ ప్రారంభించిన డాక్టర్లు తొడ ఎముకకు అమర్చాల్సిన ప్లేట్లు లేవని తెలియడంతో అర్ధాంతరంగా ఆపేశారు.

Andhra Pradesh: ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. ఆపరేషన్ ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన వైద్యులు
Chittoor Government Hospita
Follow us
Surya Kala

|

Updated on: Jan 13, 2023 | 7:15 AM

చదువు వస్తే ఉన్న మతి పోయినట్లుంది అక్కడి ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు. ఆపరేషన్‌కు ముందు అన్ని చెక్‌ చేసుకోవాల్సిన వైద్యులు.. సర్జరీ ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. అసలేం జరిగింది? దీనిపై ప్రశ్నిస్తే ఆ వైద్యుల నిర్లక్ష్యం అనుకోకుండా వారే స్వయంగా బయట పెట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. ఎముకల సర్జరీకి వాడే ప్లేట్లను సమకూర్చుకోకుండా ఆపరేషన్ ప్రారంభించిన వైద్యులు మధ్యలో నిలిపివేశారు. యాదమరి మండలానికి చెందిన వృద్ధురాలు పుష్పమ్మ బాత్రూంలో జారిపడింది. వైద్యం కోసం బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. బంధువులకు కొన్ని షరతులు కూడా విధించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో లేనివి బయట నుంచి తీసుకురావాలన్నది వాటి సారాంశం.

పుష్పమ్మకు ఆపరేషన్‌ చేయాలని చెప్పిన వైద్యులు ఎక్స్‌రే, స్కానింగ్ టెస్ట్‌లు బయట ప్రైవేట్‌గా చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సర్జరీ ప్రారంభించిన డాక్టర్లు తొడ ఎముకకు అమర్చాల్సిన ప్లేట్లు లేవని తెలియడంతో అర్ధాంతరంగా ఆపేశారు. నోరు జారి పుష్పమ్మ కుమారుడి దగ్గర ఈ విషయం బయటపెట్టారు. ఆపై తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. పుష్పమ్మ ఆరోగ్యం నిలకడగా లేదంటూ మాట దాటవేశారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆపరేషన్‌ నిలిపేశారని బంధువులు ఆగ్రహిస్తుంటే.. ఆమె ఎముక మెత్తగా ఉన్న కారణంగా సర్జరీ సక్సెస్ కాదని నిలిపివేశామని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై హాస్పిటల్‌లో గందరగోళం నెలకొంది. దీనిపై విచారణకు ఆదేశించారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..