Women Health: మహిళలకు అలెర్ట్.. నాలుగు పదుల వయస్సు దాటితే దీనిపై దృష్టిపెట్టడం మంచిదట.. లేకుంటే..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jan 13, 2023 | 8:06 PM

ప్రస్తుత కాలంలో మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై పూర్తిగా దృష్టిసారించాలని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

Women Health: మహిళలకు అలెర్ట్.. నాలుగు పదుల వయస్సు దాటితే దీనిపై దృష్టిపెట్టడం మంచిదట.. లేకుంటే..
Women Health

Follow us on

ప్రస్తుత కాలంలో మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై పూర్తిగా దృష్టిసారించాలని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అయితే, కాలనుగుణ పండ్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. శీతాకాలంలో ఎక్కువగా లభించే అరటి, నారింజ, మోసాంబి లాంటి కాలానుగుణ పండ్ల గురించి ఒక అపోహ ఉంది.. చల్లని వాతావరణంలో వాటి వినియోగం వల్ల చలి పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. ఇది సరైనది కాదంటూ పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాస్తవానికి కాలానుగుణ పండ్లు ఎప్పుడూ ఆరోగ్యానికి హాని చేయవు. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి హాని కలగదు. సీజనల్ పండ్లు, ఆకు కూరలు ఈ సీజన్‌లో సులభంగా లభిస్తాయి. అయితే, 45 ఏళ్ల తర్వాత అదనపు ప్రొటీన్లు అవసరమని మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తరచూ ఈ విషయాన్ని విస్మరిస్తుంటారు. ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి మహిళలు తమ ఆహారంలో మొలకెత్తిన తృణధాన్యాలను తీసుకోవడం మంచిది. వేరుశెనగ ప్రోటీన్ కి మంచి మూలం. చల్లటి వాతావరణంలో శనగపిండి, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవచ్చు.

చలి కాలంలో చాలా మంది జామ, అరటి వంటి సీజనల్ పండ్లను తీసుకోవడం మానేస్తారు. ఇలాంటి సరైనది కాదు. సీజనల్ పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదు. ఈ పండ్లను ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన తర్వాత నేరుగా తినకూడదు. ఈ రోజుల్లో వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. రాత్రి, ఉదయం చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మాత్రమే కాస్త వేడిగా అనిపిస్తుంది. ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాస్త కష్టమే. అందుకే.. చాలా చల్లని వస్తువులను తీసుకోవడం మానుకోండి. ఇది గొంతు నొప్పిని కలిగించవచ్చు.

చల్లని బదులుగా వెచ్చని నీరు తాగండి..

ఇవి కూడా చదవండి

ఈ సీజన్‌లో తక్కువ నీరు తాగుతుంటారు. దీని వల్ల చర్మం పొడిబారుతుంది. మహిళలు రోజూ కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి. చల్లటి వాతావరణంలో చల్లటి నీరు తాగే బదులు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. నిమ్మ, నారింజ, మోసాంబి వంటి విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని.. తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంటున్నారు. 45 ఏళ్లు దాటిన వారు ఆరోగ్యంపై దృష్టి సారిస్తేనే.. భవిష్యత్తులో వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu