Megastar Chiranjeevi: అతను నాపై విషప్రయోగం చేశాడు.. అయినా క్షమించి వదిలేశా.. చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి

ఒక అభిమాని తనపై విషప్రయోగం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ఏదో వశీకరణం పౌడర్ కలిపి తీసుకొచ్చిన కేక్‌ను తనకు బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించాడంటూ గతంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

Megastar Chiranjeevi: అతను నాపై విషప్రయోగం చేశాడు.. అయినా క్షమించి వదిలేశా.. చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jan 12, 2023 | 8:28 PM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్‌ కే.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు మెగాస్టార్‌. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్‌, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కాగా ఒక అభిమాని తనపై విషప్రయోగం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ఏదో వశీకరణం పౌడర్ కలిపి తీసుకొచ్చిన కేక్‌ను తనకు బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించాడంటూ గతంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘మరణమృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని చేసిన పిచ్చిపని నా ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ అభిమాని కేక్ తెచ్చి బలవంతంగా నోట్లో పెట్టాడు. అయితే నాకు స్పూన్‌తో తినడం అలవాటు. ఆ తర్వాత నాకు చేదుగా అనిపించడంతో బయట పడేశా. అయితే అ సమయంలో అతను చేత్తో నాకు కేక్ తినిపించాడు. అంతేకాదు చేదుగా కూడా అనిపించింది. దీంతో వెంటనే బయట పడేశా. వెంటనే సెట్‌లో ఉన్నవారితో ఈ విషయం చెప్పాను. అతన్ని పట్టుకుని నాలుగు తగిలిస్తే నిజం చెప్పాడు’

అభిమాని తెచ్చిన కేక్ శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపారు. అందులో విషం కలిసినట్లు తేలింది. కేరళ నుంచి ఏదో వశీకరణం పౌడర్ తీసుకొచ్చి కేక్‌లో కలిపినట్లు తెలిసింది. ఇది విని అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటంటే కేక్‌ తినిపించినది నాకు పిచ్చి అభిమాని. అయితే అతనిని పట్టించుకోలేదనే నాపై వశీకరణ ప్రయోగం చేశాడు. ఈ విషయం తెలుసుకుని నేను వెంటనే అతన్ని క్షమించి వదిలేశా’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా వాల్తేరు వీరయ్య సినిమా శుక్రవారం (జనవరి 13) గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సమకూర్చిన పాటలు, టీజర్లు, ట్రైలర్లు సూపర్‌ హిట్ కావడంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!