Neem For Healthy Skin: ప్రతి చర్మ సమస్యకు దివ్యౌషధం వేప.. ఇలా ఉపయోగించండి.. అద్భుతం చూస్తారు..
అన్ని చర్మ సమస్యలను తొలగించి, ఆరోగ్యకరమైన, మచ్చలేని, మెరిసే, యంగ్ చర్మాని పొందుతారు. చర్మ సమస్యలకు వేప ఫేస్ ప్యాక్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
చర్మ సమస్యలకు వేప ఫేస్ ప్యాక్స్: వేపను ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో నిండి ఉంది. అందువల్ల, వేపను ఉపయోగించడం ద్వారా మీరు మొటిమలు, మచ్చలు, టానింగ్, నిర్జీవ, పొడి చర్మం మొదలైన అనేక చర్మ సమస్యలను సులభంగా తొలగించవచ్చు. అందుకే ఈ రోజు మీ కోసం వేప ఫేస్ ప్యాక్‌లను గురించి చెప్పబోతున్నాం.. దీని ద్వారా మీరు అన్ని చర్మ సమస్యలను తొలగించి, ఆరోగ్యకరమైన, మచ్చలేని, మెరిసే, యంగ్ చర్మాని పొందుతారు. చర్మ సమస్యలకు వేప ఫేస్ ప్యాక్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్యాక్‌లను తయారు చేసి వాడండి.
చర్మ సమస్యలకు వేప ఫేస్ ప్యాక్స్
కొబ్బరి నూనె- వేప.. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి వేప ఆకులను ఉడకబెట్టి రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 టీస్పూన్ వేప పేస్ట్, అర టీస్పూన్ పసుపు వేసి కలపాలి. దీని తర్వాత, ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి సుమారు 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మం పొడిబారడాన్ని తొలగిస్తుంది.
తేనె -వేప.. ఈ ఫేస్ ప్యాక్ కోసం, ఒక గిన్నెలో 2 టీస్పూన్ల ఓట్ మీల్, ఒక టీస్పూన్ పాలు, ఒక టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల వేప పేస్ట్ కలపాలి. తర్వాత మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి సుమారు 15-20 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయండి. ఇది యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, ఎక్కువ కాలం మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది.
పెరుగు – వేప.. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో వేప పేస్ట్, 2 టీస్పూన్ల పెరుగు కలపాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఫేస్ ప్యాక్‌ని ముఖంపై అప్లై చేయండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ తో, మీ ముఖంపై మచ్చలు తగ్గడం ప్రారంభిస్తాయి. అంతే కాకుండా ఇది మీ ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…