Spicejet Flight: స్పైస్‌జెట్ విమానానికి బాంబు బెదిరింపు.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ట్రైనీ ఏజెంట్ అరెస్ట్
ఈ విషయమై స్పైస్‌జెట్ వెంటనే అప్రమత్తమైంది. రెస్క్యూ టీం రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబ్, పేలుడు పదార్థం వంటిది ఏదీ లేదని తేల్చేశారు. ఇదంతా ఫేక్ న్యూస్‌గా నిర్ధారించారు. కానీ,
భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందనే పుకార్లు వ్యాపించాయి. ఈ కేసులో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రైనీ టికెటింగ్ ఏజెంట్‌ని అరెస్ట్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందంటూ జనవరి 12వ తేదీ గురువారం అంటే నిన్న స్పైస్‌జెట్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేశాడు. ఈ విషయమై ఢిల్లీ ఎయిర్ పోర్ట్, స్పైస్‌జెట్ వెంటనే అప్రమత్తమైంది. రెస్క్యూ టీం రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబ్, పేలుడు పదార్థం వంటిది ఏదీ లేదని తేల్చేశారు. ఇదంతా ఫేక్ న్యూస్‌గా నిర్ధారించారు. కానీ, బెదిరింపు కాల్ చేసిన అగంతకుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు.
ఫేక్ కాలర్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలోనే బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రైనీ టికెటింగ్ ఏజెంటే బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తేల్చారు. దీంతో బ్రిటీష్ ఎయిర్‌వేస్ ట్రైనీని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని స్పైస్‌జెట్ కాల్ సెంటర్‌లో తప్పుడు బాంబు కాల్ చేసినందుకు బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రైనీ టికెట్ ఏజెంట్ అభినవ్ ప్రకాష్‌ను అరెస్టు చేసినట్లు ఐజిఐ ఎయిర్‌పోర్ట్ డిసిపి రవి కుమార్ సింగ్ కేసు వివరాలను తెలియజేశారు.
The aircraft was moved to an isolation bay. It was thoroughly inspected by security officials. Nothing suspicious was found. The call was later declared as hoax: SpiceJet Spokesperson https://t.co/6CX3dHss5c pic.twitter.com/yHDwxtsHJ6
— ANI (@ANI) January 13, 2023
Abhinav Prakash, A trainee ticketing agent of British Airways arrested for making a hoax bomb call to SpiceJet call centre at IGI Airport in Delhi yesterday: Ravi Kumar Singh, DCP IGI Airport (1/3) pic.twitter.com/5J3N3tIYz3
— ANI (@ANI) January 13, 2023
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిందితుడు అభినవ్ తన స్నేహితులు రాకేష్, మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కునాల్ మనాలి రోడ్ ట్రిప్‌కు వెళ్లారు. ఆ అమ్మాయిలు స్పైస్ జెట్ విమానంలో పూణే వెళ్లాల్సి ఉంది.. ఎలాగైనా ఢిల్లీ నుంచి విమానం ఆలస్యమయ్యేలా ప్లాన్ చేయాలని అభినవ్ స్నేహితులు కోరారు. దీంతో వారు ఇలాంటి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ విధంగా ముగ్గురు యువకులు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌లో బాంబు ఉన్నట్టుగా తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఎయిర్‌లైన్స్ సిబ్బందిలో కలకలం రేగింది. అయితే అభినవ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా, కునాల్, రాకేష్ పరారీలో ఉన్నట్టుగా తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..