AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాపం డెలివరీ బాయ్.. కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకేశాడు..

రిజ్వాన్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇంటి ఓనర్ శోబానపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: పాపం డెలివరీ బాయ్.. కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకేశాడు..
Food Delivery Boy
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 13, 2023 | 6:04 PM

గ్రామ సింహాలంటే ప్రతిఒక్కరికీ భయమే.. ఇటీవలి కాలంలో గ్రామసింహల బారినపడి కూడా చాలా మంది గాయాలపాలవుతున్నారు. వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ అందరినీ హడలెత్తిస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చిన్న పిల్లలు, పెద్దవారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరుస్తుంటాయి. కుక్కల దాడిలో గాయపడి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా అనేకం వార్తల్లో వస్తుంటాయి. అయితే, తాజాగా అలాంటిదే మరో వార్త హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం రేపుతోంది. పాపం పెంపుడు కుక్క భయపెట్టడంతో ఫుడ్ డెలివరీ బాయ్ ఒకరు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. పార్శిల్‌ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్‌పై పెంపుడు కుక్క దాడి చేయడంతో భయపడిపోయిన అతడు మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 6లోని లుంబిని ర్యాక్‌ క్యాజిల్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే శోభనా నాగాని ఫుడ్‌ డెలివరీ ఆర్డర్‌ చేశారు. ఈ నెల 11న ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్‌ రిజ్వాన్‌(23) అనే స్విగ్గి డెలివరీ బాయ్‌ పార్శిల్‌ ఇవ్వడానికి వెళ్లాడు. కానీ, అప్పటికే వారి ఇంటి తలుపు తీసే ఉంది. డెలివరీ బాయ్‌ మాట వినగానే..ఒక్కసారిగా ఇంట్లోనుంచి జర్మన్‌ షెపర్డ్‌ కుక్క బయటికి దూసుకొచ్చి అతడిని కరవబోయింది. దీంతో భయపడిపోయిన రిజ్వాన్‌ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టాడు. కుక్క కూడా అతడి వెంట పడడంతో మూడో ఫ్లోర్‌ నుంచి కిందకు దూకేశాడు.

దీంతో రిజ్వాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. రిజ్వాన్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇంటి ఓనర్ శోబానపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. దర్యాప్తు చేపట్టారు. అయితే ట్రీట్మెంట్ కు సంబంధించిన మొత్తం ఖర్చులు మేము భరించాలంటే వైట్ పేపర్ మీద సంతకం చేయాలని బాధితులను ఇంటి యజమానిని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…