- Telugu News Photo Gallery PM Modi to flag off Secunderabad to Visakhapatnam Vande Bharat Express on 15th Jan, Check train travel time, schedule and stoppages
Vande Bharat Express: ఇక నాన్‌స్టాప్ ప్రయాణమే.. తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీయనున్న వందే భారత్.. వారంలో ఎన్ని రోజులంటే..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. దేశంలోని ఎనిమిదవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (జనవరి 15, 2023) ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ రైలును ప్రధాని వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Updated on: Jan 13, 2023 | 6:20 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. దేశంలోని ఎనిమిదవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (జనవరి 15, 2023) ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ రైలును ప్రధాని వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ప్రయాణికులకు కేటరింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రెండు రకాలుగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. అయితే, క్యాటరింగ్ సదుపాయం వద్దనుకుంటే ఈ ఛార్జీలను మినహాయిస్తారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైలు (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఒక నిమిషం పాటు ఆగనుంది. ఈ మేరకు ప్రయణానికి సంబంధించిన ఛార్జీల వివరాలను రైల్వే ప్రారంభించింది.

రైల్వే.. వందేభారత్ ట్రైన్ నెంబర్, ఛార్జీల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. భోజన సదుపాయం వద్దనుకుంటే.. ఛార్జీలు తగ్గనున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య పరుగులు తీయనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. విశాఖ.. సికింద్రాబాద్ మధ్య 700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది.

పునరాభివృద్ది కానున్న సికింద్రాబాద్ స్టేషన్‌లో విశాలమైన డబుల్-లెవల్ రూఫ్ ప్లాజా తో పాటు రిటైల్ షాపులు, ఫలహారశాలలు, వినోద సౌకర్యాలు, ప్రయాణీకుల రాక/నిష్క్రమణలు వేర్వేరుగా, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, ట్రావెలేటర్‌లు, మల్టీలెవల్ కార్ పార్కింగ్ వంటి ఎన్నో సౌకర్యాలతో పాటు రైలు ఎక్కావల్సిన, దిగవలసిన ప్రయాణికులకు అంతరాయం లేకుండా ఇతర రవాణా మార్గాలతో మల్టీమోడల్ కనెక్టివిటీ అందించనుందని. దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

Vande Bharat Express

ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం ఈ రైలు ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.

ఈ రైలుతో సమయం ఆదా అవ్వడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది.





























