- Telugu News Photo Gallery Business photos Most attractive and feature full Electric Cars showcased at CES 2023
Electric Cars: అంతర్జాతీయ మార్కెట్ ని షేక్ చేస్తున్న కొత్త కార్లు ఇవే.. లుక్ మైండ్ బ్లాస్టింగ్.. ఫీచర్లు అవుట్ స్టాండింగ్..
ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ ఎగ్జిబిషన్ కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్) ఫుల్ స్వింగ్ లో ఉంది. వందలాది కంపెనీలు తమ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శిస్తున్నాయి. వాహనాల విషయానికి వస్తే అందరూ ఎక్కువగా ఎలక్ట్రిక్ వేరియంట్లనే అధికంగా వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, అత్యద్భుత స్పెసిఫికేషన్లతో ఎలక్ట్రిక్ కార్లను అక్కడ ఆవిష్కరించాయి. వీటిల్లో వినియోగదారులను ఆకర్షించిన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 13, 2023 | 7:08 PM

BMW i Vision Dee: ఊసరవెల్లి తెలుసుకదా.. అది పరిస్థతులను బట్టి రంగులను మార్చుకుంటూ ఉంటుంది. ఈ కారు అంతే.. తన రంగులను దానంతట అదే మార్చుకుంటుంది. దీని పేరుకు తగ్గట్లుగానే ఈ కారు డిజిటల్ ఏమోషనల్ ఎక్స్ పీరియన్స్ ను వినియోగదారులకు అందిస్తుంది. బీఎండబ్ల్యూ అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత ఆకర్షణీయ లుక్లో దీనిని ఆవిష్కరించింది. దీనిలో ఫ్రంట్ హెడ్ లైట్లు మనిషి ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టినట్లుగా అవి కూడా అక్కడి వాతావరణ పరిస్థితుల బట్టి మూడ్ ని తెలియజేస్తాయి. ఆ మూడ్ ని బట్టి ఈ కారు దాదాపు 32 రంగులలో తనను తాను మార్చుకుంటూ ఉంటుంది. 2025 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Peugeot Inception Concept: సీఈఎస్ లో అందరి దృష్టిని ఆకర్షించినది ప్యూగోట్ ఇన్ సెప్షన్ కాన్సెప్ట్. ఫ్రెంచ్ బ్రాండ్ కు చెందిన ఈ కంపెనీ ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఈ కారును ఆవిష్కరించింది. ఆటో డ్రైవింగ్ మోడ్ దీనిలో ప్రధాన ఆకర్షణ. అంతేకాక లోపల స్పేషియస్ ఇంటీరియర్, ఐ కాక్ పిట్, రెట్రాక్టబుల్, వీడియో గేమ్స్ లో వాడే డిజిటల్ కంట్రోల్స్ తో కూడిన డ్రైవ్ బై వైర్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఆకట్టుకున్నాయి.

RAM 1500 Revolution BEV Concept: ర్యామ్ కంపెనీ సీఈఎస్ లో తన తొలి ఎలక్ట్రిక్ ట్రక్ ను ఆవిష్కరించింది. అయితే ఇదే మోడల్ లో ఇప్పటికే ఫోర్డ్, చెవ్రోలెట్ వంటి కంపెనీలు ఈ తరహా ట్రక్ లను మార్కెట్ లోకి విడుదల చేశాయి. అయితే వాటిని మించిన లుక్లో ఈ ర్యామ్ 1500 రివల్యూషన్ బీఈవీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ఉంది. దీనిలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన యూజర్ ఇంటర్ ఫేస్ అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ లాక్ సిస్టం ఉంది. 2024 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Sony Honda Mobility Afeela Prototype: సీఈఎస్ లో సోనీ ఇంతకుముందే ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు హొండా కంపెనీతో సంయుక్తంగా ఓ కారును ప్రదర్శించింది. సరికొత్త సాఫ్ట్ వేర్ కనెక్టెవిటీ తో పాటు యూజర్ ఎక్స్ పీరియన్స్ ఫీచర్లను ఈ కారులో ఉంచింది. అ కారులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ సపోర్టుతో నడిచే 45 కెమెరాలు, సెన్సార్లు ఉన్నాయి. వీటితో ఎదుటి వాహనాలతో కమ్యూనికేట్ అవగలుగుతుంది. నార్త్ అమెరికాలో 2025 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసి 2026 నాటికి వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేస్తోంది.

Volkswagen ID.7: ఈకారు 40 లేయర్ల ఎలక్ట్రో ల్యూమినిసెంట్ పెయింటింగ్ తో వస్తోంది. సెడాన్ వేరియంట్లో అత్యాధునిక సౌకర్యాలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. దీనిలోని అత్యాధునిక బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 400 మైళ్ల మైలేజీ ఇస్తుంది. అంతేకాక దీనిలో అగ్యుమెంటెండ్ రియాలిటీతో కూడిన 15 అంగుళాల ల్యాండ్ స్కేప్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టం కూడా అందుబాటులో ఉంది. దీనిని ఈ ఏడాది రెండో క్వార్టర్ లోనే మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉంది.




