- Telugu News Photo Gallery Business photos BYD Atto 3 EV Special Edition launched at Rs. 34.49 lakh, check out specs, features and More in Telegu
BYD Atto 3: సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చేసిన ఆట్టో 3 స్పెషల్ ఎడిషన్.. ఏకండా 520 కి.మీ మైలేజీ.. మరెన్నో ప్రత్యేకతలు..
BYD India ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తన కొత్త Atto 3 ఎలక్ట్రిక్ SUV స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రత్యేక రంగు ఎంపికలో విడుదల అయిన ఈ కొత్త కారు మోడల్‌ను కొనుగోలు చేయడానికి 1,200 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Updated on: Jan 14, 2023 | 10:55 AM

BYD ఇండియా ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2023లో తన కొత్త Atto 3 ఎలక్ట్రిక్ SUV స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

ఈ Atto 3 ఎలక్ట్రిక్ SUV స్పెషల్ ఎడిషన్‌కు చెందినవి1,200 యూనిట్లు మాత్రమే భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ రూ. ధర 34.49 లక్షలు.

స్పెషల్ ఎడిషన్ ప్రత్యేక ఫీచర్లతో ఆకర్షణీయమైన ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో మార్కెట్‌లోకి వచ్చింది.

ఈ స్పెషల్ ఎడిషన్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ డోర్ , రియర్ వ్యూ మిర్రర్ అసెంబ్లీని కొత్త కలర్ ఆప్షన్‌లతోనే కలిగి ఉంది.

స్పెషల్ ఎడిషన్‌లో ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్ మినహా స్టాండర్డ్ మోడల్‌లో ఉన్న అదే టెక్నాలజీ ఉంది. ఈ కొత్త EV కారులో 60.48kWh బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంది.

ఒక్క సారి చార్జింగ్ పెడితే గరిష్టంగా 521 కిమీ మైలేజీని ఇచ్చే ఈవీ కారు ఇది. ఇక భారతదేశంలో E6 MPV తర్వాత, Atto 3 కారుతో భారీ డిమాండ్‌ను పొందుతున్న BYD కంపెనీ ఇప్పటివరకు సుమారు 2 వేల మంది కస్టమర్‌ల నుంచి బుకింగ్‌లను పొందింది.




