AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: నాసిక్-షిర్డీ హైవే ప్రమాదంపై స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..

జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషాదం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు,గాయపడిన బాధితులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Maharashtra: నాసిక్-షిర్డీ హైవే ప్రమాదంపై స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..
Nashik Shirdi Highway Accid
Jyothi Gadda
|

Updated on: Jan 13, 2023 | 6:32 PM

Share

సంక్రాంతి పండగకు ఒక రోజు ముందుగా మహారాష్ట్రలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన 10 మందిలో ఐదుగురు మహిళలు కాగా, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ప్రయాణికులందరినీ నాసిక్ జిల్లా ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆసుపత్రి, సిన్నార్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పతారే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో ఉన్న చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 50 మంది ప్రయాణికులు థానే నుంచి బస్సు ఎక్కారు. ఉల్లాస్‌నగర్‌ నుంచి సాయి దర్శనానికి బయలుదేరిన 15 బస్సుల్లో ఇదొకటి అని పోలీసులు తెలిపారు. బస్సు సిన్నార్-షిర్డీ స్టేట్ ఫ్రీవే గుండా షిర్డీకి వెళుతుండగా ఉదయం 7 గంటలకు ప్రమాదం జరిగింది. చనిపోయిన 10 మందిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, గాయపడిన 30 మందిని నాసిక్ జిల్లా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, సిన్నార్ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషాదం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 200,000, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

బస్సు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..