Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కుటుంబమంతా గాఢ నిద్రలో ఉండగా.. ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు.. వైరల్‌ అవుతున్న సీసీ ఫుటేజ్‌..

వీడియోలో , ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ క్యాన్లతో ఇంటి వద్దకు వచ్చి నఫీస్ ఇంటికి నిప్పు పెట్టడం స్పష్టంగా కనిపించింది. ఓ వ్యక్తి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంతలో రెండో వ్యక్తి అగ్గిపుల్లను వెలిగించి ఇంటిపైకి విసిరేయడం వీడియోలో రికార్డయ్యింది.

Viral Video: కుటుంబమంతా గాఢ నిద్రలో ఉండగా.. ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు.. వైరల్‌ అవుతున్న సీసీ ఫుటేజ్‌..
Delhifire Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 13, 2023 | 3:53 PM

దేశ రాజధాని ఢిల్లీలో రోజుకో రకమైన నేర సంఘటనలు భయాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటిల్లిపాదిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు కొందరు దుండగులు.. రాత్రి కుటుంబం మొత్తం నిద్రిస్తుండగా ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆ ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటన ఢిల్లీలోని భజన్‌పూర్‌లోని వినయ్‌ పార్క్‌లో జనవరి 8న జరిగింది. దాడికి సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో చేరటంతో స్థానికంగా తీవ్ర కలకలంరేపుతోంది.

ఢిల్లీలోని భజన్‌పూర్‌లోని వినయ్‌ పార్క్‌లో నివసిస్తున్న నఫీస్ మాలిక్, అతని కుటుంబ సభ్యులు రాత్రి వారి ఇంట్లో నిద్రిస్తుండగా ముగ్గురు అపరిచితులు వారి ఇంటికి నిప్పంటించారు. మంటలు చెలరేగడంతో వెంటనే మేల్కొన్న అతడు ఇంటి వెనుక డోర్‌ ఓపెన్‌ చేసుకుని బయటకు పరుగులు తీశారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడగలిగారు. కానీ, ప్రమాదంలో అతనికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి.

ఈ సంఘటన గత వారం జరిగింది. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఇంటికి నిప్పంటిస్తున్న దృశ్యం సీసీటీవీలో రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో , ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ క్యాన్లతో ఇంటి వద్దకు వచ్చి నఫీస్ ఇంటికి నిప్పు పెట్టడం స్పష్టంగా కనిపించింది. ఓ వ్యక్తి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంతలో రెండో వ్యక్తి అగ్గిపుల్లను వెలిగించి ఇంటిపైకి విసిరేయడం వీడియోలో రికార్డయ్యింది. వెంటనే ఇంటికి మంటలు అంటుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇంటి బయట పార్క్ చేసిన సైకిల్, మోటారు బైక్ కూడా దగ్ధమయ్యాయి. కాల్పులు జరిపిన ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నారు. నిందితుల కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టరాఉ. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఘటనా స్థలంలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..