Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanjhawala Case: కంఝవాలా ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్.. పోలీస్ ఆఫీసర్లు సహా 11 మంది సస్పెండ్..

న్యూ ఇయర్ రోజున దేశ రాజధాని ఢిల్లీలోని కంఝవాలాలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తప్పతాగిన యువకులు స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టి కొన్ని కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారు.

Kanjhawala Case: కంఝవాలా ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్.. పోలీస్ ఆఫీసర్లు సహా 11 మంది సస్పెండ్..
Kanjhawala Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 13, 2023 | 3:42 PM

న్యూ ఇయర్ రోజున దేశ రాజధాని ఢిల్లీలోని కంఝవాలాలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తప్పతాగిన యువకులు స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టి కొన్ని కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో యువతి మృతిచెందింది. ఈ ఘటన అనంతరం ఢిల్లీ పోలీసులు కారులో ఉన్న ఐదుగురితోపాటు సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. కారుతో తొక్కించి యువతిని చంపిన ఘటనపై యాక్షన్ చేపట్టింది. ఈ మేరకు 11 మంది పోలీసులను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో సహా 10 మందిపై చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన సమయంలో పీసీఆర్ లో ఉన్న పోలీసులతోపాటు.. రూట్‌లో పికెటింగ్ డ్యూటీలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంది.

సస్పెండ్ అయిన వారంతా రోహిణి జిల్లాకు చెందిన పోలీసు అధికారులు.. 11 మంది పోలీసులలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. వీరిలో ఆరుగురు పీసీఆర్ డ్యూటీలో ఉండగా, ఐదుగురు ఘటన జరిగిన రోజు పికెట్ వద్ద ఉన్నారు. దీనిని కాంపిటెంట్ అథారిటీ ఆమోదించిందని.. రోహిణి జిల్లాకు చెందిన మొత్తం 11 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కొత్త సంవత్సరం రోజు స్కూటీపై వెళ్తున్న ఈవెంట్ ప్లానర్ అంజలీ సింగ్‌ను.. కారుతో ఢీకొట్టి నిందితులు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం రోడ్డుపై పక్కన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై స్పెషల్ కమీషనర్ షాలినీ సింగ్ నేతృత్వంలోని కమిటీ విచారించింది. కమిటీ సమర్పించిన నివేదికను అనుసరించి కేంద్ర హోంశాఖ ఆ మార్గంలో మోహరించిన సిబ్బంది అందరినీ సస్పెండ్ చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) గురువారం ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ట్రావిస్ హెడ్‌ను తగులుకున్న స్టార్క్! 8 ఇన్నింగ్స్ లో 6 సార్లు..
ట్రావిస్ హెడ్‌ను తగులుకున్న స్టార్క్! 8 ఇన్నింగ్స్ లో 6 సార్లు..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర