Rapido Bike Taxi: రాపిడోకి ఆ రాష్ట్ర హైకోర్టులో గట్టి దెబ్బ.. అన్ని సర్వీసులను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు..

పూణేకు చెందిన రాపిడో సేవలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. బైక్ ట్యాక్సీలకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో తెలిపింది.

Rapido Bike Taxi: రాపిడోకి ఆ రాష్ట్ర హైకోర్టులో గట్టి దెబ్బ.. అన్ని సర్వీసులను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు..
Rapido Bike Taxi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 13, 2023 | 5:36 PM

బైక్ టాక్సీ సర్వీస్ కంపెనీ అయిన రాపిడోకు బాంబే హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పుణెలో తక్షణమే అన్ని సేవలను నిలిపివేయాలని కంపెనీని హైకోర్టు ఆదేశించింది. బైక్ ట్యాక్సీలతో పాటు కంపెనీ రిక్షాలు, డెలివరీ సర్వీసులు కూడా లైసెన్స్ లేనివేనని కోర్టు పేర్కొంది. రాపిడో టాక్సీ సర్వీస్‌కు సంబంధించి విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు శుక్రవారం (జనవరి 13) మధ్యాహ్నం 1 గంట నుంచి అన్ని సేవలను నిలిపివేయాలని కంపెనీని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల తర్వాత జనవరి 20 వరకు రాష్ట్రంలోని అన్ని సేవలను నిలిపివేసేందుకు కంపెనీ అంగీకరించింది. దీనిపై వచ్చే శుక్రవారం మరోసారి విచారణ జరగనుంది.

విషయం ఏంటి?

ఇవి కూడా చదవండి

రాపిడో 16 మార్చి 2022న పూణే RTOలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. దానిని రవాణా శాఖ తిరస్కరించింది. దీనితో పాటు, రాపిడో యాప్, దాని సేవలను ఉపయోగించవద్దని రవాణా శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీని తర్వాత రాపిడో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నవంబర్ 29, 2022న, అనుమతిని పునఃపరిశీలించాలని హైకోర్టు ఆ శాఖను కోరింది. 21 డిసెంబర్ 2022న జరిగిన ఆర్టీఏ  సమావేశంలో ఇది మళ్లీ తిరస్కరించబడింది. రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలకు సంబంధించి స్పష్టమైన నిబంధన లేదని పేర్కొంది.

మళ్లీ దరఖాస్తు తిరస్కరణకు గురికావడంతో ర్యాపిడో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టు బైక్ ట్యాక్సీలకు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. విచారణ సందర్భంగా, ‘బైక్ టాక్సీ’కి సంబంధించి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి కమిటీ తన నివేదికను త్వరలో సమర్పించనుంది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వీసును వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!