Makar Sankranti: సంక్రాంతికి ఆ పట్టణంలో ఒక్క గాలిపటం కూడా ఎగురదు.. వందల ఏళ్లుగా ఇదే ఆచారం.. కారణం ఏంటంటే..?
దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. శనివారం భోగి, ఆదివారం సంక్రాంతి, సోమవారం కనుమ పండుగ జరగనుంది. పట్టాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. శనివారం భోగి, ఆదివారం సంక్రాంతి, సోమవారం కనుమ పండుగ జరగనుంది. పట్టాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. అయితే, మకర సంక్రాంతిని జరుపుకునే ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేసి దానధర్మాలు చేస్తారు. ఇదంతా ఒకటైతే, మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేసే ప్రత్యేక సంప్రదాయం కూడా అన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరేయడం ఎప్పటి నుంచి మొదలైందో చెప్పడం కష్టం.. కానీ గత 250 ఏళ్లుగా మకర సంక్రాంతికి ఒక్క గాలిపటం కూడా ఎగురవేయని నగరం కూడా ఉంది. ఆ ప్రత్యేక పట్టణం రాజస్థాన్‌లో ఉంది. మకర సంక్రాంతి నాడు ఇక్కడ గాలిపటాలు ఎందుకు ఎగురవేయరు, దాని వెనుక కారణం ఏమిటీ..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మకర సంక్రాంతి రోజున చాలా మంది గాలిపటాలు ఎగురవేసి సంతోషంగా పండుగను జరుపుకుంటారు. కానీ రాజస్థాన్‌లోని కరౌలీ నగరంలో మాత్రం గత 250 ఏళ్లుగా మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరేయడం లేదు. మహారాజా గోపాల్ సింగ్ కాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, మకర సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడానికి బదులుగా జన్మాష్టమి, రక్షా బంధన్ రోజున గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం ఉంది. కరౌలి ప్రజలు గత 250 ఏళ్లుగా మకర సంక్రాంతికి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
250 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని..
మీడియా కథనాల ప్రకారం.. కరౌలి పూర్వం రాచరిక రాష్ట్రంగా ఉంది. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ 250 సంవత్సరాల క్రితం రాజు కాలంనాటి సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. కరౌలిలోని మదన్ మోహన్ విగ్రహమే ఇందుకు కారణమని కొందరు భావిస్తున్నారు. కరౌలిలో మకర సంక్రాంతి రోజున పూజలు, దానధర్మాలు చేసే సంప్రదాయం ఉందని.. కానీ గాలిపటాలు మాత్రం ఎగురవేయరని పేర్కొంటున్నారు.
కరౌలిలో మకర సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతాయంటే..?
మకర సంక్రాంతి రోజున ప్రజలు కరౌలిలో పూజలు, దానధర్మాలు చేస్తారని పేర్కొంటున్నారు. కరౌలిలో మకర సంక్రాంతి నాడు కూడా వివిధ ప్రదేశాలలో భండారాలు సైతం నిర్వహిస్తారు. ప్రజలు పేదలకు వెచ్చని దుస్తులు, బెల్లం, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేస్తారు.
మకర సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం లేదని కరౌలి స్థానిక ప్రజలు కూడా చెబుతున్నారు. మకర సంక్రాంతి నాడు పేదలకు అన్నదానం చేసే సంప్రదాయం ఉంది. ఇక్కడ పువా, పూరీ, మాంగోడ, వెచ్చని దుస్తులు.. ఇలా పేదలకు అవసరమైన వాటిని దానం చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..