- Telugu News Photo Gallery Uttarakhand receives season's first Snowfall 2023 and attracting tourism Telugu News
Uttarakhand: దేవతల నిలయం ఉత్తరాఖండ్.. మంచు అందాలు చూశారా…?
ఉత్తరాఖండ్‌తో సహా అక్కడి చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఈ యేడు మొదటి హిమపాతం ప్రారంభమైంది. ఆ అద్భుతమైన దృశ్యాలు చూసిన పర్యాటకులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అందమైన ప్రదేశాలను చూసి ఫిదా అవుతున్నారు..
Updated on: Jan 13, 2023 | 3:26 PM

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఈ సంవత్సరం మొదటి హిమపాతం నమోదైంది. దీంతో ఇళ్లు, రోడ్లు, దేవాలయాలు సహా ఆ ప్రాంతమంతా పూర్తిగా మంచుతో దుప్పటి కమ్మేసింది. అక్కడి దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

జనవరి 16, 17 తేదీల్లో ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉన్నందున ఢిల్లీలో చలిగాలులు వీచే అవకాశం ఉంది.

జనవరి 15-17 వరకు రాజస్థాన్‌లోని ఉత్తర ప్రాంతాలలో చల్లటి గాలుల కారణంగా తీవ్రమైన చలిని ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో కూడా చలి గాలి పెరుగుతుంది.

ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాలు హిమపాతం, చలి గాలులతో వణికిపోతోంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, ఔలి సహా ఎత్తైన ప్రాంతాలు ఎటు చూసినా తెల్లటి మంచుతో కప్పబడి ఉన్నాయి.

బద్రీనాథ్‌లోని సింగ్‌ద్వారా, చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి మంచు కురుస్తుంది. ఔలీలోనూ మంచు కురుస్తోంది. కేదార్‌నాథ్ ధామ్‌లో కూడా భారీగా మంచు కురుస్తోంది. ఓ వైపు కురుస్తున్న మంచును చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.





























