Hyderabad: ఏసీబీ వలలో బహదూర్ పుర ఎస్ఐ.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పోలీస్..
ఎస్ఐ శ్రవణ్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎస్ఐ శ్రవణ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు.
ప్రజల్ని రక్షించాల్సిన రక్షకభటులే తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని బహదూర్ పుర ఎస్ఐ శ్రవణ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ శ్రవణ్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎస్ఐ శ్రవణ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు.
ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే తన ఫోన్ తనకు తిరిగి ఇవ్వాలని బాధిత వ్యక్తి ఎస్ఐ శ్రవణ్ కుమార్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్ఐ రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శ్రవణ్ కుమార్ ఛాంబర్‌తో పాటు అతని నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..