TSRTC Bus Tracking: ఇక నో టెన్షన్.. ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. పూర్తి వివరాలు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jan 13, 2023 | 4:15 PM

సంక్రాంతికి ప్రజలను సురక్షితంగా సొంతూళ్లకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు..

TSRTC Bus Tracking: ఇక నో టెన్షన్.. ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. పూర్తి వివరాలు..
TSRTC

Follow us on

సంక్రాంతికి ప్రజలను సురక్షితంగా సొంతూళ్లకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు TSRTC సాంకేతికతను వినియోగిస్తోంది. అందుకు ‘TSRTC Bus Tracking’ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు బస్సు ట్రాకింగ్‌ లింక్‌ను సందేశరూపంలో అధికారులు పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్‌ యాప్‌ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే 1800 బస్సు సర్వీస్‌లకు బస్సు ట్రాకింగ్‌ సదుపాయం కల్పించినట్లు టీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈ సంక్రాంతికి ముందుస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించిన 600 ప్రత్యేక బస్సులకూ ట్రాకింగ్‌ సౌకర్యాన్ని అనుసంధానం చేసినట్లు తెలిపింది. త్వరలోనే హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లతో సహా మిగిలిన సర్వీస్‌లన్నింటికీ ట్రాకింగ్‌ సదుపాయం కల్పిస్తామని.. ఈ సంక్రాంతికి ప్రయాణికులకు అసౌకర్యం కలగొద్దనే ఉద్దేశంతో వారి ఫోన్లకు బస్సు ట్రాకింగ్‌ లింక్‌ను సందేశరూపంలో పంపిస్తున్నామని పేర్కొంది. ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో వారు తెలుసుకోవచ్చు.. అంటూ టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ పేర్కొన్నారు.

యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా!

‘TSRTC Bus Tracking’ పేరుతో ఈ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో హైదరాబాద్‌ సిటీతో పాటు జిల్లా సర్వీస్‌లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా టీఎస్‌ఆర్టీసీ పొందుపరిచింది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతో పాటు అవి ప్రస్తుతమున్న లోకేషన్‌ను తెలుసుకోవచ్చు.

Tsrtc

Tsrtc

ప్రయాణికుల సమీపంలోని బస్టాప్‌, సర్వీస్‌ నంబర్‌, బస్సు నంబర్‌లను ఎంటర్‌ చేసి వివరాలను పొందవచ్చు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే రిపోర్ట్‌ చేసే సదుపాయాన్ని ఈ యాప్‌లో కల్పించారు.

బస్సు బ్రేక్‌ డౌన్‌, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu